ఇలాంటి కష్టాలు పగవాడికి కూడా రాకూడదు.. బ్రిటన్ ఎన్నారై బాధాకరమైన స్టోరీ వింటే!!

కరోనా సమయంలో అభాగ్యులకు భోజనం పెట్టి రియల్ హీరోగా నిలిచిన ఒక ఎన్నారై పరిస్థితి ఇప్పుడు చాలా దయనీయంగా మారింది.వివరాల్లోకి వెళితే.

 Indian Covid Hero Vimal Pandya Honoured By Uk Queen Now Faces Deportation Deails-TeluguStop.com

విమల్ పాండ్య (42) 2011లో ఉన్నత చదువుల మేరకు బ్రిటన్ వెళ్లారు.మూడేళ్ల కాలం గడిచిపోయాక ఆయన చదువుకుంటున్న కాలేజీ లైసెన్స్‌ను బ్రిటిష్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది.

ఈ విషయం విమల్ తెలుసుకోకుండా 2013లో తన బంధువు చికిత్స కోసం భారత్‌కు వెళ్లాడు.తర్వాత మళ్లీ బ్రిటన్‌కు వెళ్లాక బ్రిటన్‌లో నివసించే హక్కును కోల్పోయాననే అసలు సంగతి తెలిసి షాక్ అయ్యాడు.

Telugu Britain, British Nri, Indian Covid, Latest, Nri, Uk, Uknri, Vimal Pandya-

ఇక అప్పటి నుంచి వీసా కోసం లీగల్‌గా అతడు పోరాడుతూనే ఉన్నాడు.కాగా చివరికి అతనికి నిరాశే ఎదురయింది.సౌత్ లండన్‌లోని Rotherithe ప్రాంతంలో నివసిస్తున్న పాండ్య అలుపెరగని న్యాయపోరాటం చేసి ఎంతో డబ్బులు ఖర్చు చేశాడు.కాగా జనవరి 24న లోకల్ కోర్టు న్యాయస్థానం పాండ్యకు వ్యతిరేకంగా తీర్పు ప్రకటించింది.

ఈ కేసులో అన్ని అంశాలను పరిశీలించిన కోర్టు వలసల విధాన సామాజిక శ్రేయస్సు కోసం దేశంలో అతడిని ఉండకూడదని ఆదేశించింది.దాంతో అతడు కన్నీరు మున్నీరవుతున్నాడు.

Telugu Britain, British Nri, Indian Covid, Latest, Nri, Uk, Uknri, Vimal Pandya-

అంతేకాకుండా, ఈ తీర్పును సవాల్ చేసేందుకు గరిష్టంగా 28 రోజుల వ్యవధి ఉండగా… దానిని ఉపయోగించుకోవడానికి సిద్ధమవుతున్నాడు.అక్కడ కూడా వ్యతిరేకంగా తీర్పు వస్తే బ్రిటన్ హోం శాఖ అతడిని దేశం నుంచి వెళ్లగొడుతుంది.అయితే స్థానికంగా ఎన్నో మంచి పనులు చేసి గొప్ప పేరు తెచ్చుకున్న అతనికి చాలామంది ప్రజలు మద్దతు ఇస్తున్నారు.వీసా తిరిగి ఇవ్వాలని, దేశంలో అతడిని ఉండనివ్వాలని, ఆన్‌లైన్‌లో క్యాంపెయిన్ కూడా నిర్వహిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube