వైరల్: మ్యాజిక్ చేసి కడుపు నింపేశాడుగా... ఆహా, రుచికరమైన పదార్ధాలు!

మ్యాజిక్ అంటే ఏమిటో ఇక్కడ తెలియని వారు ఉండనే వుండరు.మనం చిన్నప్పటినుండే మ్యాజిక్ ని చూస్తూ వస్తున్నాం.

 Man Did Magic At Restaurant Filled Empty Plate With Food Items Details, Food, Ma-TeluguStop.com

ఎంత పెద్దవాళ్ళైనా సరే మ్యాజిక్ చూశారంటే చిన్నపిల్లలు అయిపోతారు.ఇక మ్యాజిక్ చేస్తున్నపుడు మెజీషియన్ మ్యాజిక్ ఎలా చేస్తున్నాడో తెలియక చాలా తికమక పడుతుంటాం.

ఇక ఈ మ్యాజిక్ అనేది అందరికీ సాధ్యం కాదు.అదొక ప్యాషన్.

కొందరు మాత్రమే దానిని చేయగలరు.వీటికి సంబంధించి చాలా టీవీ షోలు కూడా వచ్చాయి.

అంతే కాకుండా సోషల్ మీడియాలో మ్యాజిక్ కు సంబంధించిన వీడియోలు మనకు చాలానే దర్శనం ఇస్తాయి.

Telugu Items, Magic, Latest-Latest News - Telugu

ముఖ్యంగా మ్యాజిక్ కి సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అందులో వున్న ఓ మెజిషీయన్ మ్యాజిక్ చూసి.

నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.వైరల్ అవుతున్న వీడియోని ఒకసారి గమనిస్తే, రెస్టారెంట్‌లో కూర్చున్న ఓ మహిళ తన ఆర్డర్ కోసం వేచి ఉంది.

అంతలో అక్కడికి ఓ మెజిషీయన్ వచ్చి మ్యాజిక్ చేస్తానని చెప్పి ఓ ఖాళీ ప్లేట్ తీసుకున్నాడు.దానిపై ఓ క్లాత్ పరిచి సెకన్ల వ్యవధిలోనే మ్యాజిక్ చేసి అందులో ఫుడ్ వచ్చేలా చేసి ఆ మహిళను ఆశ్చర్యపరిచాడు.

Telugu Items, Magic, Latest-Latest News - Telugu

దాంతో ఆ మ్యాజిక్ చూసి ఆ మహిళ ఆశ్చర్యపోతుంది.అతనికి అదెలా సాధ్యపడిందో అని అలా చూస్తూ ఉండిపోతుంది.ఇక ఆ అద్భుతమైన మ్యాజిక్ ట్రిక్ అర్ధంగాక సోషల్ మీడియా జనాలు కూడా తలకిందులైపోతున్నారు.9 సెకన్ల నిడివిగల ఈ వీడియో ట్విట్టర్‌ మాధ్యమంలో పోస్ట్ కాగా ఇంటర్నెట్‌లో చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది.ఇప్పటివరకు దానిని 5 లక్షలకు పైగా చూడగా లక్షకు పైగా లైక్స్ చేయడం కొసమెరుపు.ఇక సదరు వీడియో చూసిన తర్వాత నెటిజన్లు తమ అభిప్రాయాలతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube