హైదరాబాద్ రాంగోపాల్ పేటలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న డెక్కన్ మాల్ కూల్చివేతకు రంగం సిద్ధమైంది.ఈ మేరకు రేపటి నుంచి కూల్చివేత పనులను ప్రారంభించనున్నారు.
ఈ కూల్చివేత పనులను ఎస్కే మల్లు కంపెనీకి ప్రభుత్వం అప్పగించింది.కాగా 1890 చదరపు మీటర్ల నిర్మాణం కూల్చడానికి రూ.33,86,268 ధరను నిర్ణయించారు.ఈ క్రమంలో 38.14 శాతం తక్కువ ఖర్చుతో పని చేసేందుకు కంపెనీ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.అయితే ఈ కూల్చివేతలో 20 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
వ్యర్థాలను టెండర్ దక్కించుకున్న ఏజెన్సీ తొలగించాలి.అదేవిధంగా చుట్టుపక్కల వారికి ప్రమాదం, ఇబ్బంది లేకుండా ఏజెన్సీ చూసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.