సాధారణంగా మిగిలిన సీజన్లతో పోలిస్తే ప్రస్తుత చలికాలంలో జుట్టు తరచూ పొడిబారిపోతూ నిర్జీవంగా మారుతుంటుంది.ఎంత ఖరీదైన షాంపూ, కండిషనర్ వాడినప్పటికీ తగిన ఫలితం లభించదు.
దాంతో ఏం చేయాలో తెలియక తీవ్రంగా సతమతం అయిపోతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ ఆయిల్ ను కనుక వాడితే చలికాలంలోనూ కురులు ఆరోగ్యంగా మరియు మృదువుగా మెరిసిపోతాయి.
డ్రై హెయిర్ అన్న మాట అనరు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ పవర్ ఫుల్ ఆయిల్ ను ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక గ్లాస్ జార్ తీసుకుని అందులో ఒక కప్పు కొబ్బరి నూనె వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు మందారం పొడి, వన్ టేబుల్ స్పూన్ ఆముదం, ఐదు నుంచి ఆరు చుక్కలు రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత మూత పెట్టి రెండు రోజుల పాటు ఎండలో ఉంచాలి.రెండు రోజుల తరువాత కాటన్ వస్త్రం సహాయంతో ఆయిల్ ను సపరేట్ చేసుకొని ఒక బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.ఈ ఆయిల్ ను నైట్ నిద్రించే ముందు జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి కాసేపు మసాజ్ చేసుకోవాలి.
మరుసటి రోజు ఉదయాన్నే మైల్డ్ షాంపూను ఉపయోగించి తల స్నానం చేయాలి.
వారంలో రెండు సార్లు ఈ ఆయిల్ ను రాసుకుంటే పొడి బారిన కురులు మృదువుగా షైనీగా సిల్కీగా మారతాయి.జుట్టు కుదుళ్లు బలంగా ఆరోగ్యంగా తయారవుతాయి.దాంతో జుట్టు రాలడం, చిట్లడం, విరగడం వంటివి తగ్గు ముఖం పడతాయి.
అంతేకాదు ఈ పవర్ ఫుల్ ఆయిల్ ను వాడటం వల్ల త్వరగా తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది.జుట్టు ఒత్తుగా మరియు పొడుగ్గా సైతం పెరుగుతుంది.