బ్రేకింగ్: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు

తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది.ఈ మేరకు ఫిబ్రవరి 13వ తేదీన మోదీ హైదరాబాద్ కు రానున్నారు.

 Breaking: Prime Minister Modi's Visit To Telangana Is Over-TeluguStop.com

ఈ సందర్బంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.ఐఐటీ హైదరాబాద్ లో నూతన భవనాన్ని ప్రారంభించనున్నారు.

అదేవిధంగా తెలంగాణలో మూడు జాతీయ రహదారుల విస్తరణ పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు.అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభకు మోదీ హాజరుకానున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఈనెల 19న హైదరాబాద్ కు ప్రధాని మోదీ పర్యటనకు రావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వలన వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube