పవన్-బాలయ్య 'అన్ స్టాపబుల్' గ్లింప్స్ వచ్చేసింది.. అదరగొట్టిన కాంబో!

నందమూరి బాలకృష్ణ గత కొన్ని రోజుల నుండి సినిమాలతో పాటు ఓటిటిలో కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాడు.బాలకృష్ణ మొట్టమొదటి సారిగా హోస్ట్ గా చేసిన షో ‘అన్ స్టాపబుల్’.

 Balakrishna Unstoppable Show With Pawan Kalyan Show Glimpse, Pawan Kalyan, Pawan-TeluguStop.com

సినీ సెలెబ్రిటీలు పాల్గొంటున్న ఈ షో సీజన్ 1 గ్రాండ్ సక్సెస్ అయ్యింది.సీజన్ 1 ఘన విజయం సాధించడంతో సీజన్ 2 కూడా ఇటీవలే స్టార్ట్ చేసారు.

ఇప్పటికే సీజన్ 2 నుండి వచ్చిన ఎపిసోడ్స్ అందరిని ఆకట్టు కున్నాయి.

ఇక ఇటీవలే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ షోలో పాల్గొనడం అందరికి ఆసక్తిగా మారింది.

ఈయన ఎపిసోడ్ ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంది.ఇక ఇప్పుడు పవర్ స్టార్ కూడా రాబోతున్నాడు.ప్రభాస్ తర్వాత అంత కంటే స్టార్ డమ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ షోకు విచేసినట్టు ఇప్పటికే సమాచారం వచ్చేసింది.

అయితే తాజాగా ఈ రోజు సంక్రాంతి పండుగ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కు సంబంధించిన అప్డేట్ అందించారు.బాలయ్య-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ కోసం ఇరు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.మరి వారి ఎదురు చూపులకు ఈ రోజుతో ఫలితం వచ్చేసింది.

ఈ రోజు ఈ ఎపిసోడ్ కు సంబంధించిన గ్లింప్స్ వదిలారు.

ఈ గ్లింప్స్ మొత్తం పవర్ ఫుల్ గా ఉంది.పవన్-బాలయ్య కలిసి ఒకే ఫ్రేమ్ లో చాలా రోజుల తర్వాత చూడడంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.పవర్ స్టార్ రాకతో ఆహా ప్రాంగణం మొత్తం సందడి వాతావరణం నెలకొంది.

మరి పండగ పూట ఈ చిన్న గ్లింప్స్ కూడా ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చింది అనే చెప్పాలి.ఈ గ్లింప్స్ లో చివరిగా పవర్ స్టార్ నవ్వు అందరికి బాగా కనెక్ట్ అయ్యింది అనే చెప్పాలి.

మరి ఈ అవైటెడ్ ఎపిసోడ్ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube