వైసీపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు.జనసేన అధినేత పవన్ కల్యాణ్ కామెంట్స్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
సీఎం జగన్ ను విమర్శించే అర్హత పవన్ కు లేదని చెప్పారు.హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టి నష్టపోయామన్న ఆయన మరోసారి అదే తప్పు జరగకూడదనే అందరి అభిప్రాయమని తెలిపారు.
అమరావతిలో రాజధాని కోరుకుంటోంది రియల్ ఎస్టేట్ వ్యాపారులేనని పేర్కొన్నారు.విశాఖ రాజధానితో తమ ప్రాంతం అభివృద్ధి చెందుతోందని వెల్లడించారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏం చేయాలో పవన్ సూచించాలన్నారు.మా ప్రాంతానికి వచ్చి మమ్మల్నే విమర్శిస్తారా అని ప్రశ్నించారు.
ఉత్తరాంధ్ర బాగుపడటం పవన్ కు ఇష్టం లేదని విమర్శించారు.చంద్రబాబుకు పొరపాటున అధికారం ఇస్తే మళ్లీ అమరావతిలోనే పెట్టుబడులు పెడతారని చెప్పారు.
అదే జరిగితే విశాఖ కేంద్రంగా రాష్ట్రం అడిగానని స్పష్టం చేశారు.ఉద్దానంలో కిడ్నీ సమస్యలకు పరిష్కారం చూపామన్న మంత్రి ధర్మాన వారికి త్వరలోనే స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వబోతున్నట్లు తెలిపారు.