సినిమా రివ్యూలు రాయాలంటే ఇంతలా వణికి పోవాలా ?

వందల కోట్లు పెట్టి తీసిన సినిమా బాగున్నా, బాగాలేకపోయిన ఒక రెండు వారల వరకు ఎలాంటి నెగటివ్ టాక్ మాట్లాడకూడదని అంటున్నారు.సినిమా బాగుంటే బాగుందని చెప్పాలి కానీ, బాగోలేకపోతే రెండు లేదా మూడు వారాలు ఆగి చెప్పాలి అంట.

 Movie Reviews Impact On Cine Industry Details, Movie Reviews, Movie Reviews Impa-TeluguStop.com

ఎందుకంటే ఒక సినిమా పైన వందల కోట్ల పెట్టుబడులు, వందల కుటుంబాలు ఆధారపడి ఉండటమే కారణం గా చెప్తున్నారు.సినిమా ఫ్లాప్ అయినా ప్రతి సారి నెగటివ్ రివ్యూస్ చెప్పడం వల్లనే ఫ్లాప్ అయ్యిందని మీడియా పైన నోరు పారేసుకుని పెద్దలు, హిట్ అయితే మాత్రం మా సబ్జెక్టు చాలా మంచిది కాబట్టి హిట్ అయ్యింది అని అంటున్నారు.

సినిమా హిట్ లేదా ఫ్లాప్ డిసైడ్ చేస్తుంది ఒక రివ్యూ లేదా పబ్లిక్ టాక్ వీడియోస్ కావు.మీ సినిమాలో దమ్ముంటే ఎవరు ఆపిన సినిమా ఆగదు.

పైగా వందల కోట్లు మీరు ఖర్చు పెడితే లాభాలు వేళా కోట్లు మీరే వెనకేసుకుంటారు.ఇందులో మా లాంటి వారికి వచ్చేది ఏముంది, సినిమా చూడటానికి 175 రూపాయలు ఖర్చు పెట్టె అభిమాని కి మాత్రమే నాణ్యంగా రివ్యూ చేరాలి అనేది మా ప్రయత్నం.

Telugu Cine, Budget, Reviews, Reviews Impact, Produers, Public, Tollywood-Movie

అది చెత్త అయినా నోరు మెదపకుండా ఉండాలి అని సినీ పెద్దలు కోరుకోవడం విడ్డూరంగా ఉంది.సినిమా ఫ్లాప్ అయితే సినిమా మీద ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డున పడతాయి అంటూ బ్లాక్ మెయిల్ చేయడం సరి కాదు.వారి చేత పని చేయించుకునేం సినిమా పెద్దలు వారి సంరక్షణ బాధ్యత కూడా భుజాన వేసుకోవాలి.కోట్లు కూడబెట్టే మీకు ఈ మాత్రం బాధ్యత పట్టదా ? మలయాళంలో ఎంత చిన్న సినిమాలు తీసి అద్భుతాలు సృష్టిస్తారో మనకు తెలియనిది కాదు.

Telugu Cine, Budget, Reviews, Reviews Impact, Produers, Public, Tollywood-Movie

అక్కడ వచ్చే లౌ బడ్జెట్ సినిమాలను కూడా మన దగ్గర రీమేక్ చేస్తూ కోట్లు తగలేస్తూ నిర్మాతల కోసం భరించండి అంటే అది కరెక్టా ? పైగా మీకు చేతనైతే ఇంకా మంచి సినిమాలు తీసి చూపించండి అంటూ వర్కింగ్స్ ఇస్తున్నారు.ఎవరు ఎం తీసిన, ఎం చేసిన మేము 175 రూపాయలు జేబులో పెట్టుకొని సినిమా చూడటానికి వచ్చే వ్యక్తి కోసం మాత్రమే రివ్యూస్ రాస్తాం.ఇకనైనా నాణ్యత ఉన్న సినిమాలను తీసి సినిమాను, ప్రేక్షకుడిని బ్రతికించండి.ఇదే మా విన్నపం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube