నేడు గుంటూరులో చంద్రన్న కానుక పంపిణీ చేయనున్న చంద్రబాబు..!!

నేడు గుంటూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు.ఉయ్యూరు ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదవాళ్లకు జనతా వస్త్రాలు మరియు సంక్రాంతి కానుక పంపిణీ చేయనున్నారు.

 Chandrababu To Distribute Chandranna Kanuka In Guntur Today , Tdp, Chandrababu,-TeluguStop.com

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రవ్యాప్తంగా చంద్రన్న సంక్రాంతి కానుక పేరిట పేదలకు నిత్యవసర సరుకులను పంపిణీ చేసేవారు.అయితే ఆ తర్వాత ప్రభుత్వం మారటంతో ఈ పథకం ఆగిపోయింది.

పరిస్థితి ఇలా ఉంటే అధికారంలో ఉన్న లేకపోయినా పేదలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో దీనిని తిరిగి కొనసాగించాలని తెలుగుదేశం పార్టీ భావించడం జరిగింది.

ఈ సందర్భంగా గుంటూరు సదాశివనగర్‌లో వికాస్ హాస్టల్ మైదానంలో నేడు 30 వేల మందికి సంక్రాంతి కానుకతో పాటు జనతా వస్త్రాలు చంద్రబాబు పంపిణీ చేయనున్నారు.

ఈరోజు సాయంత్రం గుంటూరులో ఈ కార్యక్రమంలో నిర్వహించిన తర్వాత ఐదున్నర గంటలకు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.చంద్రబాబు పర్యటన నేపథ్యంలో.పైగా నూతన సంవత్సరం కావటంతో గుంటూరు జిల్లా టీడీపీ కీలక నేతలు… భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube