టీడీపీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏపీ సీఎం వైఎస్ జగన్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.పంచాయతీలకు సంబంధించి కేంద్రం ఇచ్చే నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు.
ఈ రకంగా స్థానిక సంస్థలను సీఎం జగన్ మోసం చేశారని మండిపడ్డారు.మూడు లక్షల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని ఆరోపించారు.
సీఎం వైఎస్ జగన్ పై 120 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు.
జనాల్లోకి జగన్ రాలేక పోలీసులను అడ్డం పెట్టుకుని ఎంతకాలం దాక్కొంటారని సెటైర్లు వేశారు.
బటన్ నొక్కటం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు.మూడున్నర సంవత్సరాల కాలంలో ఒక డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు.
యువతకు ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించలేదు.జగన్ పరిపాలన మొత్తం మోసం చేయటమే అని ఆరోపించారు.
పోలవరం ఎత్తును కూడా తగ్గించి ప్రజలను మోసం చేశారని ఆరు లక్షల పింఛన్లు కట్ చేశారని విమర్శల వర్షం కురిపించారు.గాలికి వచ్చిన వైసీపీ ప్రజా ప్రతినిధులు గాలికి కొట్టుకుపోతారని బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.