విద్యుత్ గీజర్, గ్యాస్ గీజర్... ఏది బెటర్? 

దేశంలో చలికాలం నడుస్తోంది.దేశవ్యాప్తంగా చలిగాలులు అందరినీ వణికిస్తున్నాయి.

 Electric Geyser, Gas Geyser Which One Is Better , Electric Geyser, Gas Geyser,-TeluguStop.com

అలాంటి పరిస్థితుల్లో చల్లటి నీటితో స్నానం చేయడం, చల్లటి నీటితో బట్టలు ఉతకడం లాంటి ఏ పనైనా చేయడం ఎంతో కష్టం.ఇటువంటి పరిస్థితుల్లో గీజర్ ఉపయోగకరంగా ఉంటుంది.

అయితే గీజర్ అనగానే చాలా మంది గ్యాస్ గీజర్ అనువైనదా ఎలక్ట్రిక్ గీజర్ అనువైనదా అనే గందరగోళానికి గురవుతుంటారు.అందుకే ఈ రెండింటి మధ్య తేడాను ఇప్పుడు తెలుసుకుందాం.

విద్యుత్ గీజర్ఈ పేరుతో దీని పనితీరు అర్థం చేసుకోవచ్చు.ఇది విద్యుత్తుపై పనిచేస్తుంది.శీతాకాలంలో నీటిని వేడి చేయడానికి దీనిని ఉపయోగిస్తారు.దీనిలో ఒక రాగి కాయిల్ ఉంటుంది, ఇది విద్యుత్తును ఉష్ణ శక్తిగా మారుస్తుంది.

వేడి నీటిని సిద్ధం చేయడానికి పనిచేస్తుంది.ఎలక్ట్రిక్ గీజర్‌ను విరవిగా ఉపయోగిస్తారు.

మరోవైపు మెయింటెనెన్స్ పరంగా ఇది చాలా బెటర్.ఎలక్ట్రిక్ గీజర్లు రెండు రకాలు.

అవి ఎలక్ట్రిక్ స్టోరేజ్ గీజర్, ఎలక్ట్రిక్ ఇన్‌స్టంట్ గీజర్.మీ అవసరాన్ని బట్టి వీటిని కొనుగోలు చేయవచ్చు.

గ్యాస్ గీజర్డొమెస్టిక్ గ్యాస్ అంటే ఎల్‌పీజీతో ఇది పనిచేస్తుంది.ఈ గ్యాస్ గీజర్‌ను నీటిని వేడి చేయడానికి ఉపయోగిస్తారు.గ్యాస్ గీజర్‌తో త్వరగా నీటిని వేడిచేయవచ్చు.ఈ గీజర్లు ముఖ్యంగా కుటుంబ సభ్యలు ఎక్కువమంది ఉన్నప్పుడు ఉపయోగపడతాయి.అలాంటివి కుటుంబమంతటికీ ఉపయుక్తమవుతాయి.అయితే ఈ కానీ గ్యాస్ గీజర్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి, మంచి వెంటిలేషన్ కలిగిన బాత్రూమ్ ఉండటం అవసరం.

అందులో గ్యాస్ వాడకం వల్ల అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది.గ్యాస్ గీజర్‌లు కూడా రెండు రకాలు, ఇన్‌స్టంట్ గ్యాస్ గీజర్‌లు, స్టోరేజ్ గ్యాస్ గీజర్‌లు.

వేడి నీటి నిల్వ అవసరం లేని వారికి, తక్షణ గీజర్ ఎంపిక మంచిది.పెద్ద కుటుంబాలలో ఎక్కువగా నీటినిల్వ గీజర్ అవసరమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube