జనవరి 1 నుంచి కొత్త రూల్స్‌ షురూ.. వినియోగదారులు ఇవి గమనించాలి!

బ్యాంకింగ్‌, ఆదాయపు పన్ను, ఇన్సూరెన్స్, గ్యాస్‌ సిలిండర్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తదితర రంగాలలో ప్రతి నెలా కొన్ని రకాల కీలక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి.ఇక ఈ ఏడాది డిసెంబర్‌ మరికొన్ని రోజులలో ముగియనుంది.

 New Rules From January 1st Fuel Rates Banking Gas Cylinder Rates Details, Januar-TeluguStop.com

దాంతో జనవరి 1 నుంచి కొత్త రూల్స్‌ అందుబాటులోకి రానున్నాయి.అందువలన ముఖ్యంగా మన వినియోగదారుల ఇలాంటి విషయాలను తెలుసుకోవడం ఎంతో అవసరం.

లేదంటే అనవసర ఆందోళనలకు గురి అవ్వడం ఖాయం.ఇపుడు జనవరి 1 నుంచి ఎలాంటి నిబంధనలు మారనున్నాయో తెలుసుకుందాం.

ముఖ్యంగా జనవరి 1 నుంచి పెట్రోల్‌, డీజిల్‌, క్రెడిట్‌ కార్డుల విషయంలో మార్పులు ఉండే అవకాశం మెండుగా ఉంది.అలాగే వాహనదారులకు సంబంధించి కూడా కొత్త నిబంధనలు రానున్నాయి.

వచ్చే ఏడాదిలో కొత్త బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నందున ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన విషయాల్లో మార్పులు జరగనున్నాయి.క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్ల గురించి బ్యాంకులు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి మార్పులు తీసుకొచ్చే అవకాశం కలదు.

అలాగే జనవరి 23 నుంచి ఇన్సూరెన్స్‌ ప్రీమియం పెంచేందుకు IRDAI పరిశీలిస్తోంది.

ఇక వాహనాలకు సంబంధించిన హైసెక్యూరిటీ నంబర్‌ ప్లేటు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.లేకుంటే గరిష్టంగా రూ.5వేల వరకు జరిమానా చెల్లించుకోవాల్సి ఉంటుంది.సాధారణంగా ప్రతి నెల మొదటి వారంలో కంపెనీలు CNG, PNG వంటి ధరలను సవరిస్తుంటాయి.2022 నవంబర్ నెలలో కమర్షియల్ సిలిండర్ల ధరలు తగ్గాయి.డిసెంబర్‌లో మాత్రం ఎలాంటి మార్పు లేదనే విషయం తెలిసినదే.అయితే ఇప్పుడు జనవరిలో ధరలు పెరగడం గాని, తగ్గడం గాని జరుగుతుంది.ఢిల్లీ, ముంబై వంటి ప్రాంతాల్లో ఈ ధరలు భారీగా పెరగడం మీకు గమనించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube