భారతీయ మిర్చి వడ రుచి చూసిన బ్రిటన్ దేశీయుడు.. టేస్ట్‌ అద్భుతం అంటూ కితాబు!

భారతదేశం అనేక రకాల ఆహారపు అలవాట్లకు నిలయం అని చెప్పనవసరం లేదు.దేశదేశాలవారు మన ఇంటి వంటకాలను లొట్టలేసుకుని మరీ తింటారంటే అతిశయోక్తి కాదు.

 Uk Man Jake Dryan Tries Indian Spicy Mirchi Vada Video Viral Details, Indian Foo-TeluguStop.com

అలాంటివారిలో బ్రిటన్ వ్యక్తి జాక్ డ్రేన్ ఒకరు.సహజంగా భారత్ వంటకాలంటే పడిచచ్చే జాక్ డ్రేన్ ఇన్‌స్టాగ్రాం ఫీడ్ ఒకసారి మీరు గమనిస్తే షాక్ అవుతారు.

తాజాగా అతగాడు జాక్ మిర్చి వడ ట్రై చేయగా సదరు రెసిపీకి దేశీ నెటిజన్లు ఫిదా అయిపోయారు.అవును, జాక్ AP, తెలంగాణ, కర్నాటక, రాజస్ధాన్‌, గుజరాత్‌, తమిళనాడు, పంజాబ్‌, కేరళ సహా పలు రాష్ట్రాల డిష్‌లను తయారుచేసి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాడు.

ఈ క్రమంలోనే ఇప్పుడు మిర్చి వడ హాట్ హాట్ గా తయారుచేసి భారత భోజన ప్రియులను సైతం నోరూరించారు.కాగా ఈ మిర్చి వడ చేస్తున్న తాజా వీడియో 90 లక్షలకు పైగా వ్యూస్ రాబట్టడం విశేషం.

రాజస్ధాన్ ఫుడ్ సిరీస్‌లో భాగంగా ఆయన మిర్చి వడ చేయడం విశేషం.ఈ వీడియోలో జాక్ మిర్చిలను కట్ చేసి వాటిలో ఉడకబెట్టిన ఆలూను స్టఫ్ చేసి శనగపిండిలో ముంచి ప్యాన్‌లో డీప్ ఫ్రై చేయడం స్పష్టంగా కనిపిస్తుంది.

ఆపై అవి గోల్డెన్ కలర్‌ వచ్చేవరకు పక్క ప్రొఫెషనల్ గా దోరగా వేయించడం విశేషం.

అంతేకాకుండా ముందు మిరపకాయల్లో ఆలూ మసాలా స్టఫ్ చేసి శనగపిండిలో ముంచడం చూస్తే… ఆహా అనిపంచక మానదు.ఇక ఈ వీడియోకు క్యాప్షన్ కూడా అదేనండోయ్! దేశీ నెటిజన్లు ఈ వీడియో చూసి లొట్టలేస్తూ జాక్ కుకింగ్ స్కిల్స్‌పై విశేషంగా ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ వంటకాలను మీరు చేస్తున్న తీరు బాగుంది… ఎలాంటి స్పూన్‌లు ఉపయోగించకుండా చేతులను వాడటం నిజంగా సూపర్ అని నెటిజన్లు చెబుతున్నారు.

ఇంకో యూజర్ ఫన్నీగా మీరు చేతులు శుభ్రంగా కడుక్కోవడం ప్రధానం! అని కామెంట్ చేసాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube