విజయవాడలో నకిలీ సర్టిఫికెట్ల దందా బయటపడింది.ఎస్ఆర్ పేట పీఎస్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా ఫేక్ సరిఫికేట్స్ దందాను నడిపిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది.
పదో తరగతి పరీక్ష రాయకపోయినా పది రోజుల్లో సర్టిఫికెట్ ను ఓ వర్శిటీ ప్రతినిధులు ఇస్తున్నట్లు సమాచారం.దీని కోసం భారీగా డబ్బులు గుంజుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
బ్రోకర్స్ ద్వారా వేర్వేరు సెంటర్స్ నుంచి ఫేక్ సర్టిఫికేట్స్ బిజినెస్ సాగిస్తున్నట్లు తెలుస్తోంది.ఒక్కో సర్టిఫికెట్ కు రూ.లక్షా 50 వేలకు అమ్ముతున్నారని గుర్తించారు.ఈ నేపథ్యంలో వీరి ఉచ్చులో చిక్కుకున్న అనంతపురానికి చెందిన కొంతమంది యువకులు ఒక్కొక్కరు రూ.1 లక్షా 50వేలు ఇచ్చి సర్టిఫికెట్లు కొనుకున్నారని సమాచారం.ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.