టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు అందించారు.91 సీఆర్పీ కింద అధికారులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.91 సీఆర్పీ ప్రకారం చెప్పిన చోట విచారణకు హాజరు కావాలని తెలిపారు.అడిగిన పత్రాలు, ఆధారాలు సమర్పించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఎవరు నోటీసులు అందుకొంటే వారే విచారణకు రావాలని సీబీఐ వెల్లడించింది.మరిన్ని డాకుమెంట్స్ కి సంబంధించి సమాచారం కావాలని సీబీఐ కోరింది.
అదేవిధంగా కావలిసిన పత్రాలు, సాక్ష్యాలు ఇవ్వాలని స్పష్టం చేసింది.ఈ క్రమంలో విచారణ తేదీ, స్థలం త్వరలోనే ఈ- మెయిల్ చేస్తామని సీబీఐ అధికారులు వెల్లడించారు.