వీడియో: గోధుమ బస్తాలు దొబ్బేసాడని లారీకి కట్టి ఎలా లాక్కెళ్లారంటే..?

సాధారణంగా దొంగలు రోడ్డు మీద వెళ్లే ట్రక్స్ కూడా వదలరు.వెనుక నుంచి రవాణా వెహికల్స్ ను వెంబడించి అందిన కాడికి దోచేస్తుంటారు.

 The Helper Of The Truck Driver Tied The Youth In Front Of The Truck Over Stealin-TeluguStop.com

ఇలాంటి దొంగతనాలకు సంబంధించి ఇప్పటికే ఎన్నో వీడియోలు వైరల్ కూడా అయ్యాయి.అయితే వీరిని వాహనదారులు గుర్తించడం, పట్టుకోవడం చాలా అరుదు.

కాగా తాజాగా పంజాబ్‌లోని ముక్త్‌సర్‌లో గోధుమ బస్తాలను దొంగలిస్తూ ఒక యువకుడు లారీ హెల్పర్‌కి అడ్డంగా బుక్కయ్యాడు.హెల్పర్ ఆ యువకుడిని ట్రక్కు బోన్నెట్‌కు తాడుతో కట్టేసి పోలీస్ స్టేషన్‌కి తరలించాడు.

ఈ షాకింగ్ సంఘటనకు సంబంధించి ఓ వీడియో వైరల్ గా మారింది.

నివేదికల ప్రకారం, రెండు బస్తాల గోధుమలను దొంగిలిస్తున్న యువకుడిని ట్రక్ డ్రైవర్ హెల్పర్ పట్టుకున్నాడు.

ఆపై హెల్పర్ ఆ యువకుడిని ట్రక్కు ముందు కట్టేసి శిక్షగా చాలా దూరం తీసుకెళ్లాడు.ఆ యువకుడు ట్రక్ ముందు కట్టేసి ఉండగా బిక్కు బిక్కు మంటూ చాలా భయపడుతూ ఉన్నాడు.

ఒకవేళ ఆ తాడు మిస్ అయ్యి కింద పడిపోతే అతడు చచ్చిపోయే ప్రమాదం కూడా ఉంది.

వైరల్ అవుతున్న వీడియోలో కట్టేసిన యువకుడు రెండు బస్తాల గోధుమలను దొంగిలించాడని, అతన్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తున్నట్లు హెల్పర్ ఒక వ్యక్తికి చెబుతున్నాడు.అయితే ఈ వీడియోని చూసిన నెటిజన్లు మరీ ఇంత దారుణంగా ప్రవర్తించడం ఏం బాగోలేదని అంటున్నారు.అయితే ఇలాంటి దొంగల వల్ల ట్రక్కు వాహనదారులు ఎంతో నష్టపోతున్నారని, ఈ తరహా దొంగలపై ఏమాత్రం కరుణ చూపకూడదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

కాగా పోలీసులు చట్ట ప్రకారం ఆ యువకుడికి శిక్ష విధించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube