సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలపై కేంద్ర కార్మిక శాఖ కసరత్తు మొదలు పెట్టింది.ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభంకానుంది.
రేపు సెంట్రల్ లేబర్ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన సమావేశం జరగనుంది.మూడు నెలల్లో గుర్తింపు సంఘం ఎన్నికలను పూర్తి చేయాలని కార్మిక శాఖ భావిస్తోంది.
కోల్ బెల్ట్ ఎమ్మెల్యేల భవితవ్యాన్ని సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్ణయించనున్నాయి.గత నాలుగు సంవత్సరాలుగా సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగడం లేదు.