టాలీవుడ్ స్టార్ హిరో వెంకటేష్ గురించి అందరికీ తెలిసిందే.నటుడుగా మంచి పేరుతో పాటు మంచి అభిమానం కూడా సంపాదించుకున్నాడు.
ఇప్పటికీ హీరోగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు.వెంకటేష్ చూడటానికి ఇంకా యంగ్ గానే ఉన్నా.
ఆయన పిల్లలు మాత్రం పెళ్లివయస్సు కు కూడా వచ్చేసారు.ఇక ఆయన పెద్ద కూతురు ఆశ్రిత అందరికీ పరిచయమే.
ఇక ఈమె హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు వినాయక రెడ్డి తో గతం లో పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే.ఈ పెళ్లికి ఎంతోమంది సినీ నటులు, ఇతర రంగాలకు చెందిన వాళ్లు హాజరయ్యారు.
ఇదిలా ఉంటే ఆశ్రిత సోషల్ మీడియాలో బాగా ముందుంటుంది.
అంతేకాకుండా తన ఫాలోవర్స్ తో కూడా తెగ ముచ్చటేస్తుంది.
ఇక ఆశ్రిత సోషల్ మీడియాలో ఇన్ఫినిటీ ప్లాటర్ అనే పేరుతో.ప్రొఫెషనల్ బేకర్ లా అకౌంట్ ను మెయింటెన్ చేస్తుంది.
ఈ అకౌంట్ ద్వారా రకరకాల ఫుడ్ ఐటమ్స్ ను అభిమానులతో పంచుకుంటుంది.ఈమె తన భర్తతో కలిసి విదేశాలలో ఉంటుంది.
ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెడుతూ ఉంటుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈమె హీరో నాగచైతన్య తో వంటలు చేయించింది.
తాజాగా దానికి సంబంధించిన వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో పంచుకుంది.ఇక ఆ వీడియోలో చూస్తే ఇద్దరు కలిసి ఏవేవో స్పెషల్ ఐటమ్స్ చేసినట్లు కనిపించారు.
ఆ ఫుడ్ ఐటమ్స్ కూడా చూడటానికి చాలా చక్కగా కనిపించడంతోపాటు రుచికరంగా ఉన్నట్లు కూడా కనిపించాయి.ఇక వాటిని వాళ్ళు టేస్ట్ చేసినట్లు కూడా కనిపించింది.ఇక ఆ వీడియోను షేర్ చేసిన క్షణాల్లో బాగా వైరల్ అయింది.ఆ వీడియో కేవలం ప్రోమో మాత్రమే కాకుండా దానికి సంబంధించిన వీడియో యూట్యూబ్లో ఉంటుందని తెలిపారు.
ప్రస్తుతం ఆ వీడియోకు బాగా లైక్స్ తో పాటు కామెంట్లు కూడా వస్తున్నాయి.ఇక నాగచైతన్య గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో రేంజ్ కు ఎదగకపోయినా కూడా తనకంటూ కొంత వరకు అభిమానం సంపాదించుకున్నాడు.ప్రస్తుతం స్టార్ హోదా కోసం ఎదురు చూస్తున్నాడు నాగచైతన్య.
అంతే కాకుండా బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టాడు.ఈ మధ్య పలు షోలల్లో కూడా యాక్టివ్ గా కనిపిస్తున్నాడు.
ఏడాది కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత విడిపోయాక కూడా నాగచైతన్య అవన్నీ మర్చిపోయి కెరీర్ పై ఫోకస్ పెట్టాడు.ఇక ప్రస్తుతం ఆయన ఖాతాలో పలు సినిమాలు ఉండగా ప్రస్తుతం అవి షూటింగ్ బిజీలో ఉన్నాయి.
అయితే తాజాగా అయినా వెంకి మామ కూతురు చేసే వంటల ప్రోగ్రాంలో పాల్గొనగా అందులో తను కూడా చెఫ్ గా మారి సందడి చేసినట్టు కనిపించాడు.