జబర్దస్త్ కొత్త యాంకర్ గా వచ్చిన సౌమ్య రావు కేవలం నాలుగైదు వారాలు మాత్రమే కొనసాగుతుందని అంతా భావించారు, కానీ ఆమె ను పర్మినెంట్ జబర్దస్త్ యాంకర్ గా దాదాపుగా ఖరారు చేసినట్లుగానే అనిపిస్తుంది.నాలుగు వారాల ఒప్పందం తో తీసుకు వచ్చిన సౌమ్య రావు ని కొనసాగిస్తున్నట్లుగా మల్లె మాల వారు అనధికారికంగా ప్రకటించారు.
అంతే కాకుండా మొదటి నాలుగు ఎపిసోడ్స్ కి ఆమె కి 50 వేల రూపాయల చొప్పున రెమ్యునరేషన్ ఇస్తూ వచ్చారు.కానీ సౌమ్య యొక్క యాంకరింగ్ బాగుండడం తో పాటు ప్రేక్షకులు ఆవిడ ని పాజిటివ్ గా రిసీవ్ చేసుకోవడంతో కంటిన్యూ చేసేందుకు ఒప్పందం చేసుకొని రెమ్యూనరేషన్ కూడా పెంచేసినట్లుగా తెలుస్తోంది.
ఒకే సారి 25 వేల రూపాయలు పెంచేసి ఒక్కో ఎపిసోడ్ కి 75 వేల రూపాయల రెమ్యూనరేషన్ ను ఇచ్చేందుకు మల్లె మాల వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం అందుతుంది.అంతే కాకుండా కొన్ని ఎపిసోడ్స్ తర్వాత ఆమె పారితోషికం లక్ష రూపాయలు చేసేందుకు కూడా మల్లె మాల వారు ఓకే చెప్పారని ప్రచారం జరుగుతోంది.
మొత్తానికి అనసూయ జంప్ అవడం తో ఈ కన్నడ బ్యూటీ సౌమ్య రావు కి లక్ కలిసి వచ్చింది.ఆది తో పాటు ఇతర కమెడియన్స్ తో మరియు జడ్జ్ లతో మంచి రిలేషన్ ను కలిగి ఉంటున్న సౌమ్య రావు ముందు ముందు మరింతగా దూసుకు పోతూ అనసూయ కు ప్రత్యామ్నాయం అనిపించుకోవడం మాత్రమే కాకుండా ఈమె మరో అనసూయ గా అనిపించుకోవడం ఖాయం అభిమానులు మరియు ప్రేక్షకులు భావిస్తున్నారు.
ఒక వైపు రష్మీ గౌతమ్ యాంకరింగ్ చేస్తున్న నేపథ్యం లో ఆమెను మ్యాచ్ చేయడానికి కాస్త ఎక్కువ కష్టపడాలి.కనుక సౌమ్య ను కాస్త ఎక్కువగానే జబర్దస్త్ టీమ్ మెంబర్స్ సాన బడుతున్నారనే టాక్ వినిపిస్తుంది.