టాలీవుడ్ కింగ్ నాగార్జున తనయుడు నాగ చైతన్య ప్రేమ వ్యవహారం ప్రస్తుతం మీడియా లో చర్చ కు తెర తీస్తోంది.సమంత ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య కొన్ని కారణాల వల్ల విడాకులు ఇవ్వాల్సి వచ్చింది.
విడాకులు ఇవ్వడం అనేది ఆయన యొక్క అభిమానులకు మాత్రమే కాకుండా ఏ ఒక్కరికి కూడా నచ్చలేదు.కుటుంబ సభ్యులు ఎంతగా నచ్చచెప్పే ప్రయత్నం చేసినా కూడా వారు కలిసి ఉండేందుకు అంగీకరించ లేదు.
దాంతో ఇరువురి అంగీకారం తో విడాకులు తీసుకున్నారు.విడాకులు తీసుకున్న తర్వాత సమంత వరుస సినిమా లతో బిజీ అయ్యింది.
ఇటీవల ఆమె అనారోగ్య సమస్యల కారణం గా కాస్త సినిమాల విషయం లో స్లో అయ్యింది.ఇక నాగ చైతన్య విషయానికి వస్తే ఈయన కూడా హిందీ తెలుగు అనే తేడా లేకుండా వరుస సినిమాలను చేస్తున్నాడు.
ప్రస్తుతం కస్టడీ అనే సినిమా ను చేస్తున్నాడు.అతి త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సమయం లోనే హీరోయిన్ శోభిత తో నాగచైతన్య ప్రేమ వ్యవహారం సాగుతోంది అంటూ మీడియా లో వార్తలు వస్తున్నాయి.
గతం లో ఈ వార్తలు వచ్చిన సమయం లో శోభిత క్లారిటీ ఇచ్చింది.తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అన్నట్లుగా ఆమె పేర్కొంది.కానీ ఇటీవల మరో సారి వీరిద్దరూ కలిసి కనిపించి ప్రేమ వ్యవహారం నిజమై ఉంటుంది అనే అనుమానాలు కలిగిస్తున్నారు.
వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు.ముంబై లేదా బెంగళూరు లో సహజీవనం సాగిస్తున్నారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటి వరకు వీరిద్దరికీ సంబంధించిన ప్రేమ వ్యవహారం లో క్లారిటీ అయితే రాలేదు.కానీ అనుమానాలు అయితే రోజు రోజు ఏదో ఒకటి కొత్తగా వస్తున్నాయి.
ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఆ ఫోటో ని చూపిస్తూ వీరిద్దరి సహజీవనం చేయడం లేదంటే మేము నమ్మాలా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
అసలు విషయం ఏంటి అనేది వారిద్దరిలో ఎవరో ఒకరు నోరు తెరిస్తే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.