Chicago Nats : చికాగో నాట్స్ విభాగం థ్యాంక్స్ గివింగ్ బ్యాక్ కు చక్కటి స్పందన

చికాగో: నవంబర్: 21: భాషే రమ్యం.సేవే గమ్యం నినాదంతో ముందుకు వెళ్తున్నఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా చికాగోలో నిర్వహించిన థ్యాంక్స్ గివింగ్ బ్యాక్ కార్యక్రమానికి చక్కటి స్పందన లభించింది.

 The Chicago Nats' Division Responded Well To Thanksgiving Back , Chicago, Nats,-TeluguStop.com

చికాగో నాట్స్ విభాగం చేపట్టిన ఈ కార్యక్రమంలో దాదాపు 100 మంది విద్యార్థులు మేముసైతం సమాజహితం కోసం అని స్పందించారు.ధ్యాంక్స్ గివింగ్ బ్యాక్ ద్వారా వందలాది బట్టలు, బూట్లను సేకరించారు.

ఇలా సేకరించిన వాటిని చికాగో శివారులోని అరోరాలో ఉన్న హెస్డ్ హౌస్ హోమ్ లెస్ షెల్టర్‌కు అందించారు.

చికాగో నాట్స్ నాయకులు శ్రీహరీశ్ జమ్ము, నరేంద్ర కడియాల, వీర తక్కెళ్లపాటి లు ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించారు.

నాట్స్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు మూర్తి కొప్పాక, శ్రీనివాస్ అరసాడ, శ్రీనివాస్ బొప్పన, రవి శ్రీకాకుళం ఈ కార్యక్రమానికి చికాగో నాయకులకు దిశా నిర్థేశం చేశారు.వీరితో పాటు నాట్స్ ఈసీ సభ్యులు మదన్ పాములపాటి వైస్ ప్రెసిడెంట్(సర్వీసెస్) , కృష్ణ నిమ్మలగడ్డ, లక్ష్మి బొజ్జ, బిందు వీధులముడి, రోజా శీలంశెట్టి, భారతీ పుట్టా తమ వంతు సహకారం అందించారు.

నాట్స్ చికాగో చాప్టర్ వాలంటీర్లు సుమతి నెప్పలి, బిందు బాలినేని, ప్రతిభ, ప్రత్యూష, నవీన్ జరుగుల, వేణు కృష్ణార్దుల, శ్రీనివాస్ పిడికిటి, మహేష్ కాకరాల, పండు చెంగలశెట్టి, అంజయ్య వేలూరు, గోపాల్ రెడ్డి, రాజేష్ వీధులమూడి, సతీష్, వినోద్ బాలగురు, యజ్ఞేశ్, అరుల్ బాబు, శ్రేయాన్, అక్షిత, రుషిత, ఆరుష్ , ఆదిన్, వర్షిత్, కృష్ణఫణి, సంకీత్, నిరుక్త, నిత్య, సహస్ర, హన్సిక, అన్షిక, వేద, అనీష్ తదితరులు గివింగ్ బ్యాక్ కార్యక్రమంలో చురుకుగా వ్యవహారించారు.ఇందులో పాల్గొన్న విద్యార్ధులకు నాట్స్ సేవా అవార్డులు అందించడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube