Kamal Haasan Shankarabharanam : శంకరాభరణం సినిమా దగ్గరే తెలుగు చిత్ర పరిశ్రమ ఎన్నేళ్లు ఆగిపోతుంది ?

ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం ఇండియన్ సినిమాల ప్రదర్శన కోసం ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా అనే పేరు తో ఒక సినిమా పండగ జరుగుపుతుంది.ఈ ఫెస్టివల్ లో చాలా సినిమాలు ప్రదర్శించి కొన్ని ప్రత్యేక క్యాటగిరి లో అవార్డ్స్ కూడా ప్రకటిస్తారు.

 Shankarabharnam Movie In Iffi , Shankarabharnam Movie , Inernational Film Festi-TeluguStop.com

కొన్ని సార్లు ఓల్డ్ క్లాసికల్ సినిమాలను ప్రదర్శనకు ఉంచుతారు.ఇక ఈ చిత్రోత్సవం కోసం తెలుగు సినిమా పరిశ్రమ నుంచి వి ఎన్ ఆదిత్య మరియు ప్రేమ్ రాజ్ అనే ఇద్దరు సెలెబ్స్ జ్యురీ మెంబర్స్ గా కూడా ఉన్నారు.

ఇక కృష్ణం రాజు మరియు నిర్మాత తాతినేని రామారావు గారు మరణించిన కారణం గా వారి జ్ఞాపకార్థం ఇద్దరి నేతృత్వం లో వచ్చిన జీవన తరంగాలు అనే సినిమాను ప్రదర్శించారు.

Telugu Iffi, Kamal Haasan, Krishnam Raju, Classical, Prem Raj, Sagara Sangamam,

ఇలా ఇద్దరు లెజెండ్స్ చనిపోతే హోమేజ్ కేటగిరి లో ఉమ్మడి జ్ఞాపకార్థం ఒక సినిమా వేయడం ఏంటా అని జనాలు జుట్టు పీక్కుంటున్నారు.పైగా ఈ సినిమాలో కృష్ణం రాజు ఒక హీరో కానీ కాదు శోభన్ బాబు హీరో గా చేస్తే కృష్ణం రాజు చిన్న పాత్రలో నటించాడు.ఆ మాత్రం మన జ్యురి పట్టించుకోదా అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇక 1980 లో వచ్చిన ఓల్డ్ క్లాసిక్ మూవీ శంకరాభరణం సినిమానే ఇప్పటికి గొప్ప తెలుగు సినిమాగా గుర్తిస్తున్నారు.ఆ తర్వాత అంత గొప్ప సినిమాలు మన తెలుగు ఇండస్ట్రీ లో రాలేదా అనే అనుమానం మనకే వచ్చేలా ఈ ఫెస్టివల్ ఆర్గనైజర్లు వ్యవహరిస్తున్నారు.

శంకరాభరణం ఒక గొప్ప సినిమా కానీ అంతకు మించి మళ్లీ ఎన్నో సినిమాలు వచ్చాయి.

Telugu Iffi, Kamal Haasan, Krishnam Raju, Classical, Prem Raj, Sagara Sangamam,

పూర్ణోదయా సినిమా వారు శంకరాభరణం సినిమా తీశారు.ఆ తర్వాత స్వాతి ముత్యం మరియు సాగర సంగమం వంటి సినిమాలను కూడా వారే తెరకెక్కించారు.ఈ సినిమాలను కూడా అప్పట్లో ప్రదర్శించిన శంకరాభరణం ఒక ఛాందస వాద సినిమా అనేది చాల మంది అంటున్న మాట.కమల్ హాసన్ తీసిన సాగర సంగమం, స్వాతి ముత్యం క్లాసిక్ సినిమాలుగా ఎందుకు గుర్తించలేకపోతుంది ఈ ఫెస్టివల్.పైగా ఎంతో మంది విమర్శలను సైతం శంకరాభరణం ఎదుర్కొంది.

ఇక ఇండియన్ పనోరమా విభాగం లో సినిమా బండి మరియు అఖండ సినిమాలను సెలెక్ట్ చేసారు.వాయిలెన్స్ తో కూడిన ఈ అఖండ సినిమా, అలాగే ఎప్పుడు వచ్చిందో ఎలా పోయిందో తెలియని సినిమా బండి కి ఇచ్చిన విలువ మిగతా సినిమాలకు లేదా ?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube