యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో సలార్ ఒకటి.కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుకుంటున్నారు.ఎందుకంటే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్న నీల్ కెజిఎఫ్ తో సంచలనం సృష్టించాడు.
అందుకే ఈ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ పెరిగింది.ఇక మొన్నటి వరకు ఆగిపోయిన ఈ షూట్ ఇటీవలే స్టార్ట్ అయ్యి శరవేగంగా పూర్తి అవుతుంది.
ఈయన ఇప్పటి వరకు పోషించని పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.ఇక తాజాగా ఈ సినిమా నుండి మరో అదిరిపోయే అప్డేట్ వచ్చింది.
ఈ సినిమా షూట్ కు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది.ఈ సినిమా కోసం హాలీవుడ్ నుండి స్టంట్ మాస్టర్ ని తీసుకు వచ్చారు.
క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీన్స్ ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు.ఇక ఈ సినిమాలో మరి యాక్షన్ సీక్వెన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ఇక్కడే అర్ధం అవుతుంది.
ఇప్పటికే ప్రశాంత్ నీల్ క్లైమాక్స్ ను అద్భుతంగా ప్లాన్ చేస్తున్నట్టు ప్రకటించారు.దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ కు మరింత ఎగ్జైట్ మెంట్ గా ఉంది.ఇక ఈ సినిమాను హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తుండగా.శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా 2023 సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించారు.మరి ఈ సినిమా ఫాస్ట్ గా షూటింగ్ జరుగుతుంది కాబట్టి అనుకున్న సమయానికే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.