Nayantara Radhika :నయనతార ఇంటికి వెళ్లిన నటి రాధిక.. ఫోటోలు వైరల్!

దక్షిణాది సిని ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి నయనతార గురించి అందరికీ సుపరిచితమే.ఈమె గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలుగుతూ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

 Actress Radhika Went To Nayantara House Photos Are Viral , Actress Radhika , Vig-TeluguStop.com

అయితే ఈమె 2016వ సంవత్సరం నుంచి దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.ఇలా వీరిద్దరూ ప్రేమలో ఉంటూ ఈ ఏడాది జూన్ నెలలో వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.

ఇక పెళ్లి జరిగిన నాలుగు నెలలకే వీరిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నామని తెలియజేయడంతో పెద్ద ఎత్తున ఈ విషయం వివాదంగా మారింది.

ఇక ఈ దంపతుల సరోగసి ద్వారా పిల్లలకు జన్మనిచ్చారని అన్ని ఆధారాలు సక్రమంగా ప్రభుత్వానికి అందజేయడంతో ఈ వివాదం నుంచి నయనతార దంపతులు బయటపడ్డారు.

ఇకపోతే నయనతార తమ జీవితంలోకి పిల్లలు వచ్చిన తర్వాత ఎంతో సంతోషంగా గడుపుతున్నట్టు తెలుస్తోంది.పిల్లల కోసం తాను కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు విరామం ప్రకటించాలని నిర్ణయం కూడా తీసుకున్నారట.

ఇకపోతే తాజాగా నయనతార పిల్లలను చూడటం కోసం నటి రాధిక తన ఇంటికి వెళ్లారు.

Telugu Actress Radhika, Kollywood, Nayantara, Vignesh-Movie

ఈ క్రమంలోనే రాధిక ఎగ్మోర్ లోనినయనతార ఇంటికి వెళ్లి తన పిల్లలను చూడటమే కాకుండా నయనతార విగ్నేష్ దంపతులతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఈ క్రమంలోనే ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఇలా ఈ ఫోటోలను షేర్ చేసిన రాధిక నయనతార పిల్లలు చాలా అందంగా ముద్దుగా ఉన్నారని చెప్పుకొచ్చారు.

ఇక నయనతార విగ్నేష్ తమ పిల్లల గురించి తరచూ సోషల్ మీడియా వేదికగా తెలియజేసినప్పటికీ ఇప్పటివరకు వారి మొహాలను అభిమానులకు చూపించకుండా జాగ్రత్త పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube