ప్రస్తుతం దక్షిణాది సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నాయి ఇప్పటికే పుష్ప, ఆర్ఆర్ఆర్, కే జి ఎఫ్, కాంతార,కార్తికేయ వంటి సినిమాలు భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి.ఇకపోతే వచ్చే ఏడాదే సంక్రాంతి కానుకగా పెద్ద ఎత్తున సినిమాలు పోటీపడుతున్న విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోని సంక్రాంతి బరిలో తెలుగు సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్మాత మండలి అభిప్రాయానికి రాగా తెలుగు సినిమాలను తమిళంలో విడుదల అడ్డుకుంటామంటూ తమిళ దర్శకులు సైతం వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ విషయంపై మరోసారి తెలుగు నిర్మాత మండలి రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి పండుగ ఎంతో కీలకమైనది.
ఈ పండుగ రోజున పెద్ద ఎత్తున సినిమాలు విడుదలవుతాయి అందుకే సంక్రాంతికి తెలుగు సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వమని చెబుతున్నాము కానీ డబ్బింగ్ సినిమాల విడుదల అడ్డుకుంటాము అని చెప్పడం లేదంటూ స్పష్టత ఇచ్చారు.దక్షిణాది చిత్ర పరిశ్రమలో వచ్చిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధిస్తుంటే ఇక్కడ మాత్రం భాషా బేధం చూపిస్తూ దర్శక నిర్మాతలు వివాదం సృష్టిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ విషయంపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందిస్తూ… డబ్బింగ్ సినిమాలను ఆపడం ఎవరి తరం కాదు.తెలుగు సినిమాలకే ప్రాధాన్యత డబ్బింగ్ సినిమాలకు ప్రాధాన్యత లేదు అనే విషయాన్ని చర్చకు తీసుకురావడం లేదని… ప్రస్తుతం ఏ సినిమా కథలో దమ్ముంటే ఆ సినిమాలు మాత్రమే ఆడుతాయని కంటెంట్ లేకపోతే ప్రేక్షకులు ఏ సినిమాని ఆదరించడం లేదని తెలిపారు.సినిమాకు భాషతో సంబంధం లేదని కంటెంట్ మాత్రమే ముఖ్యం అంటూ అల్లు అరవింద్ సినిమాల గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.