తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రామ్ చరణ్ ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సమయం దొరికినప్పుడల్లా వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు.అలాగే తన ఫిట్నెస్ విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు రామ్ చరణ్.
కాగా ఇప్పటికే రామ్ చరణ్ ఫిట్నెస్ కోసం కష్టపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే.
తాజాగా రామ్ చరణ్ ఫిట్నెస్ కోసం కష్టపడుతున్న మరొక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇకపోతే రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఆర్సి 15 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తి అయినట్లుగా తెలుస్తోంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం న్యూజిలాండ్ లో జరుగుతోంది.ఒక సాంగ్ తో పాటు కొన్ని యాక్షన్ సన్నివేశాలు న్యూజిలాండ్ లో ప్లాన్ చేశారట.
ఈ క్రమంలోనే షూటింగ్ కి ముందు బ్రేక్ సమయంలో రామ్ చరణ్ వర్కౌట్స్ చేయడం మొదలుపెట్టాడు.
తన ట్రైనర్ తో వర్కౌట్స్ చేస్తూ యాక్షన్ సీన్స్ కి రెడీ అవుతున్నారు రామ్ చరణ్.స్విమ్మింగ్ చేస్తూ అలాగే వెయిట్ లిఫ్టింగ్ ఇలా కసరత్తులు చేస్తూ తెగ కష్టపడుతున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఆ వీడియోని చూసిన రాంచరణ్ అభిమానులు ఆ వీడియో పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.రామ్ చరణ్ కష్టపడుతున్న తీరును చూసి మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.