మన దేశ వ్యాప్తంగా ఎన్నో సంవత్సరాల పురాతన ఆలయాలు ఉన్నాయి.ఈ ఆలయాలలో కొన్ని ఆలయాలు ఎంతో ప్రసిద్ధి చెంది ఉన్నాయి.
ఈ ఆలయాలు నిత్యం భక్తులతో రద్దీగా ఉంటాయి.అలాంటి ఆలయాలలో యాదగిరిగుట్ట స్వయంభు నరసింహుడి ఆలయం ఒకటి.
యాదగిరిగుట్ట స్వయంభు నరసింహుడికి సుప్రభాత సేవా ఉత్సవం అత్యంత వైభవంగా చేస్తారు.
తెల్లవారుజామున బ్రహ్మీ ముహూర్తంలో కౌసల్య సుప్రజా రామపుర్వ సంధ్య ప్రవర్తతే అంటూ స్థాన సుప్రభాతాన్ని ఆలకించి స్వామి వారిని అక్కడి అర్చకులు మేలుకొలుపుతారు.
అనంతరం స్వయంభూలకు, తిరువరాధన, బాల భోగం, నిజాభిషేకం, నివేదన, నిత్యబలి, ప్రధానం మంగళ శాసనంతో ప్రబోధిక కార్యక్రమానికి ముగింపు పలుకుతారు.ఈ కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు.
సాయంత్రం ముఖ మండపంలో స్వామివారిని దివ్య మనోహరంగా అలంకరించి ఆస్థానం పై పవళింప చేస్తారు.నాలుగు వేదాలు స్వామివారికి పారాయణం చేసి స్వామివారి స్వస్తి, మంత్రర్ధ వంటి మంత్రాలతో అక్కడి అర్చకులు శాంతింప చేస్తారు.
ఆ తర్వాత స్వామివారిని గర్భాలయంలో పవళింప చేస్తారు.ఉత్సవమూర్తికి ఉభయజోడు సేవలను నిర్వహించి భక్తులు కోరిన వాహనంపై స్వామి అమ్మవార్లను వెంచేపు చేసిన జోడు సేవలను తీర విధులలో ఎంతో ఘనంగా ఊరేగిస్తారు.
ఆ తరువాత సాయంత్రం కాలం ఆరాధన చేపట్టి సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహిస్తారు.స్వామి అమ్మవార్లకు పవళింపు సేవలను నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని అర్చకులు కల్పిస్తారు.ఆ తర్వాత ద్వారబంధనం చేపట్టి ఆలయాన్ని మూసివేస్తారు.కార్తీకమాసం సందర్భంగా స్వామివారి ఆలయంలో సత్యనారాయణ వ్రతాలు, దీపారాధన పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉంటారు.ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారి దర్శనాలు కొనసాగుతూనే ఉంటాయి.ప్రతిరోజు దాదాపు కార్తీకమాసంలో 22,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు.
DEVOTIONAL