LPG సిలిండర్ల విషయంలో జరుగుతున్న అవకతవలకు ప్రభుత్వం ఇక చెక్ పెట్టనుంది.గ్యాస్ సిలిండర్లో ఒకటి నుంచి రెండు కేజీల వరకు గ్యాస్ తక్కువ వస్తుందని వినియోగదారుల నుంచి అనేకరకాల ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
గతంలో అనేక ఫిర్యాదు ఈ విషయమై సదరు కంపెనీలకు పిర్యాదు చేసినా స్పందన రాకపోవడంతో యథేచ్ఛగా గ్యాస్‌ను దొంగిలిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే గ్యాస్ దొంగలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇకనుండి LPG సిలిండర్‌లకు QR కోడ్ అమర్చబోతోంది.దీంతో వినియోగదారులు అనేక ఉపయోగాలు కలవు.కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి తాజాగా ఈ విషయం గురించి మాట్లాడుతూ.LPG గ్యాస్ సిలిండర్ల నుంచి గ్యాస్ దొంగతనం నిరోధించడానికి QR కోడ్‌ను అమరుస్తున్నట్లు తెలిపారు.
అంటే ఇది కొంతవరకు ఆధార్ కార్డ్ లాగా పనిచేస్తుందన్నమాట.ఈ QR కోడ్ ద్వారా గ్యాస్ సిలిండర్‌లో ఉన్న గ్యాస్‌ను ట్రాక్ చేయడం చాలా సులువు.
అంతేకాకుండా ఎవరైనా గ్యాస్ సిలిండర్‌లో గ్యాస్‌ను దొంగిలిస్తే.ట్రాక్ చేయడం చాలా సులభమని చెప్పారు.
త్వరలో అన్ని LPG సిలిండర్‌లపై క్యూఆర్ కోడ్ ఇన్‌స్టాల్ చేయనున్నట్లు హర్దీప్ సింగ్ పూరి ప్రపంచ LPG వీక్ 2022 ప్రత్యేక సందర్భంగా ఈ విషయాన్ని చెప్పడం విశేషం.ఈ పనులను 3 నెలల్లో ప్రభుత్వం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది అని అన్నారు.గ్యాస్ సిలిండర్‌పై QR కోడ్క మెటల్ స్టిక్కర్ అతికిస్తామని, తద్వారా ట్రాకింగ్ చాలా సులభం అవుతుంది అని అన్నారు.ఇంతకు ముందు డీలర్ గ్యాస్ సిలిండర్‌ను ఎక్కడి నుంచి తీశాడో, ఏ డెలివరీ మ్యాన్ కస్టమర్ ఇంటికి డెలివరీ చేశాడో తెలిసేది కాదు.
కానీ QR కోడ్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ప్రతిదీ ట్రాక్ చేయడం చాలా సులభం అవుతుంది.దీంతో దొంగను సులువుగా పెట్టుకోవచ్చు.