Krishna poltics : కృష్ణ రాజకీయాలకు ఎందుకు దూరం అయ్యారు?

సూపర్ స్టార్ కృష్ణ.సీనియ‌ర్ నటుడు, నిర్మాత‌, ద‌ర్శ‌కుడిగా మాత్రమే కాకుండా రాజకీయాల్లోనూ రాణించారు.

 Why Did Krishna Stay Away From Politics , Super Star Krishna, Tollywood, Poltic-TeluguStop.com

సినిమాల నుంచి పాలిటిక్స్ వరకు అన్ని చోట్లా డేరింగ్‌గా దూసుకెళ్లారు.రాజకీయాల్లో తక్కువ కాలమే ఉన్నా సరే.అక్కడ కూడా తనదైన ముద్రవేశారు.ఓసారి ఎంపీగా కూడా గెలిచారు.

ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన రాజకీయాల్లో కూడా సూపర్ స్టార్ అని పిలవొచ్చు.కృష్ణ 1972 జై ఆంధ్ర ఉద్యమానికి బహిరంగంగా మద్దతు ప్రకటించారు.

ఆ తర్వాతే సినీ పరిశ్రమ నుంచి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.టీడీపీని స్థాపించి ప్రజల్లోకి వెళ్లారు.

ఆ క్రమంలోనే సూపర్ స్టార్ కృష్ణ ఈనాడు అనే సినిమా తీశారు.ఓ మాటలో చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ విధానాలకు ప్లస్ అయ్యిందని అప్పట్లో టాక్.

కొంత కాలం తర్వాత కృష్ణ ఎన్టీఆర్‌కు కాస్త దూరం అయ్యారని చెబుతారు.ఆ తర్వాతి పరిణామాలతో సూపర్ స్టార్ రాజకీయాల్లో అడుగు పెట్టారు.

ఇందిరా గాంధీ హత్య తర్వాత రాజీవ్ గాంధీ కాంగ్రెస్ బాధ్యతల్ని భుజానికి ఎత్తుకున్నారు.అప్పుడే రాజీవ్ గాంధీతో సూపర్ స్టార్ కృష్ణల మధ్య స్నేహం కుదిరింది.ఎన్టీఆర్ హవా కొనసాగుతున్న సమయలోనే కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు.హస్తం పార్టీ కృష్ణను ప్రోత్సహించింది.

అప్పట్లో ఆయన తీసిన సినిమాలు ఎన్టీఆర్‌కు వ్యతిరేకమని అప్పట్లో చర్చ జరిగింది.ఇక, 1984లో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కృష్ణకు మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీకి సన్నిహితుడిగా పేరుంది.ఆయన ఆహ్వానంతోనే కృష్ణ కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్టుగా చెబుతారు.

కృష్ణ రాజీవ్ గాంధీ ప్రోత్సాహంతో 1989లో ఏలూరు నుంచి ఎంపీగా పోటీచేసి 71వేల ఓట్ల మెజార్టీతో విజయాన్ని అందుకున్నారు.అయితే కేవలం 16 నెలల పాటు మాత్రమే ఆయన ఎంపీగా కొనసాగారు.కానీ రాజీవ్ గాంధీ హత్య తర్వాత రెండేళ్లకే మధ్యంతర ఎన్నికలు రాగా.1991లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఓటమి ఎదురైంది.ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో ఆయన రాజకీయాలకు దూరమయ్యారు.ఆ తర్వాత మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు.అయితే కాంగ్రెస్‌కు మద్దతుగానే ఉన్నారు.వైఎస్సార్‌తో కృష్ణకు మంచి సంబంధాలే ఉండేవి.

రాజీవ్ గాంధీ హత్యకు గురి కావడంతో కాంగ్రెస్‌లో కృష్ణ దూకుడు తగ్గింది.ఆ తర్వాత పూర్తిగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

మళ్లీ ఆయన సినిమాల్లో బిజీ అయ్యారు.ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు.మొదటి నుంచి చివరి వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగారు.ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న కృష్ణ.ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు.కోట్లాది మంది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు.

ప్రత్యక్ష రాజకీయాల్లో మాత్రం కొంతకాలమే ఉన్నారు.చిత్ర పరిశ్రమలో కూడా అందరితో సన్నిహితంగా ఉండేవారు.

నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకుగానూ భారత ప్రభుత్వం 2009లో కృష్ణను పద్మభూషణ్‌తో సత్కరించింది.

ఇక సూపర్ స్టార్ కృష్ణ అసలు పేరు ఘట్టంనేని శివరామకృష్ణమూర్తి.వీరరాఘవయ్య, నాగరరత్నమ్మల నలుగురు సంతానంలో కృష్ణ పెద్దవారు.సినిమాల్లోకి అరగ్రేటం చేసిన తర్వాత దర్శకుడు ఆదుర్తి ఆయన పేరును కృష్ణగా మార్చారు.

నటుడిగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగా కూడా కృష్ణ రాణించారు.మొత్తం 16 సినిమాలకు కృష్ణ దర్శకత్వం వహించారు.1974లో ఉత్తమ నటుడిగా నంది పురస్కారం సొంతం చేసుకోగా.1976లో కేంద్ర కార్మికశాఖ నటశేఖర్ అనే బిరుదుతో ఆయనను సత్కరించింది.1997లో ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవిత సౌఫల్య పురస్కారం కృష్ణకు దక్కింది.

Why Superstar Krishna Stays away from Politics

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube