సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట వంటి బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న తర్వాత మరింత హుషారుగా నెక్స్ట్ సినిమా స్టార్ట్ చేసాడు.టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఈ కాంబో ఇప్పటికే రెండు సార్లు కలిసి సినిమాలు చేసారు.ఇక ఇప్పుడు మూడవసారి ఈ కాంబోలో సినిమా రాబోతుంది.
దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఫుల్ ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.అతడు, ఖలేజా వంటి డిఫెరెంట్ సినిమాల తర్వాత ఇప్పుడు హ్యాట్రిక్ సినిమా ఎలా ఉంటుందో అని అందరిలో ఒక ఉత్సుకత అయితే ఉంది.
ఇదిలా ఉండగా ఈ సినిమా ఇటీవలే షూట్ స్టార్ట్ చేసుకుని ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది.ఇక సెకండ్ షెడ్యూల్ కోసం కూడా రెడీ అవుతున్నారు.
డిసెంబర్ మొదటి వారంలో ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ కోసం సెట్స్ మీదకు వెళ్లనుంది.త్రివిక్రమ్ మహేష్ కోసం మంచి పవర్ ఫుల్ స్టోరీని సిద్ధం చేసినట్టు టాక్.
మహేష్ గత కొన్నాళ్లుగా క్లాస్ హీరోగానే రాణిస్తున్నాడు.మరి చాలా రోజుల తర్వాత మహేష్ కూడా ఫుల్ లెన్త్ మాస్ రోల్ లోనే నటించ బోతున్నాడు.
దీంతో త్రివిక్రమ్ మహేష్ రోల్ ను ఎలా తీర్చుదిద్దుతాడో అనేది చూడాలి.ఈ సినిమాలో ఇప్పటికే భారీ తారాగణం భాగం కాబోతున్న విషయం తెలిసిందే.
త్రివిక్రమ్ పక్కా ప్లాన్ తో భారీ తారాగణాన్ని రెడీ చేస్తున్నాడు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ నోరా ఫతేహి లేడీ విలన్ రోల్ లో నటించ బోతున్నట్టు టాక్.ఇప్పటి వరకు అయితే అధికారిక ప్రకటన రాలేదు త్వరలోనే వచ్చే అవకాశం ఉందట.ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.
హారిక హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.