Geethika Tiwary : SSMB28 లో యంగ్ బ్యూటీ.. ఫస్ట్ మూవీ రిలీజ్ కాకుండానే లక్కీ ఛాన్స్!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు.ఇక మన తెలుగులో రాజమౌళి తర్వాత అంతటి గుర్తింపు తెచ్చుకుని స్టార్ డైరెక్టర్ గా వెలుగొందు తున్నాడు.

 Ahimsa Movie Beauty To Play The Second Female Lead In Ssmb28-TeluguStop.com

త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు చెబితేనే ఆ సినిమా సూపర్ హిట్ అని ముందుగానే చెప్పేస్తారు.అంతలా ఈయన తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యారు.

అయితే త్రివిక్రమ్ తన సినిమాల్లో కొన్ని సెంటిమెంట్స్ ను ఫాలో అవుతూ ఉంటాడు.ఆ సెంటిమెంట్స్ తోనే ప్రతీ సినిమాను తెరకెక్కిస్తాడు.

మరి త్రివిక్రమ్ ఎప్పటి నుండో ఫాలో అవుతున్న సెంటిమెంట్ ఏంటంటే.ఈయన సినిమాల్లో ఇద్దరు హీరోయిన్స్ ను పెట్టడం.

ఇది ఈయన చాలా సినిమాల నుండి ఫాలో అవుతూ వస్తున్నాడు.

ఇక ప్రెజెంట్ త్రివిక్రమ్ మహేష్ బాబుతో ఒక సినిమాకు కమిట్ అయ్యాడు.

ఇప్పటికే ఈ సినిమా రెగ్యురల్ షూట్ స్టార్ట్ అయ్యి ఒక షెడ్యూల్ కూడా పూర్తి అయ్యింది.ఇక అతి త్వరలోనే సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

హారిక హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తుండగా.ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

Telugu Ahimsageethika, Mahesh Babu, Pooja Hegde, Ssmb, Trivikram-Movie

ఇక ఈ మూవీలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే ఇప్పటికే ఫిక్స్ అయ్యింది.ఇప్పుడు ఈ సినిమా సెకండ్ హీరోయిన్ గురించి వార్త ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది.ఈ సినిమాలో మరో యంగ్ బ్యూటీ నటిస్తుందని టాక్.ఆమె ఎవరంటే గీతికా.ఈమె ఇప్పటికే తేజ దర్శకత్వంలో దగ్గుబాటి అభిరామ్ హీరోగా లాంచ్ అవుతున్న అహింస సినిమాలో హీరోయిన్ గా గీతికా నటిస్తుంది.ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే ఏకంగా సూపర్ స్టార్ సరసన ఛాన్స్ అందుకోవడంతో ఈ బ్యూటీ లక్ కు అంతా కుళ్ళుకుంటున్నారు.

ఈ సినిమాలో గీతికా ఒక చిన్న రోల్ లో నటించ బోతుంది అని టాక్.ఈ సినిమానే కాదు.

మరొక రెండు సినిమాల్లో కూడా ఈమెకు ఛాన్స్ వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.మరి ఈ బజ్ లో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube