సంక్రాంతికి అనుకున్న ఆదిపురుష్ రిలీజ్ వాయిదా పడటంతో ప్రభాస్ కొద్దిగా రిలాక్స్ అయ్యాడు.ఓ పక్క ప్రశాంత్ నీల్ తో సలార్ షూటింగ్ చేస్తూనే మరోపక్క మారుతితో రాజా డీలక్స్ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు ప్రభాస్.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజి ఫిల్మ్ సిటీలో జరుగుతున్నట్టు తెలుస్తుంది.ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తుండగా సినిమాలో పాన్ ఇండియా స్టార్స్ ఉంటారని టాక్.
ఈ క్రమంలో సినిమాలో కోలీవుడ్ కమెడియన్ యోగి బాబు కూడా నటిస్తున్నారట.సినిమాలో తన షెడ్యూల్ కారణంగా యోగి బాబు హైదరబాద్ వచ్చినట్టు తెలుస్తుంది.
ప్రభాస్, యోగి బాబుకి సంబందించిన సీన్స్ ప్రస్తుతం షూట్ చేస్తున్నారట.ఈమధ్య కాలంలో తమిళంలో యోగి బాబు సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు.అతన్ని సోలో హీరోగా పెట్టి కూడా సినిమాలు చేశారంటే తమిళంలో అతని క్రేజ్ ఏంటన్నది అర్ధం చేసుకోవచ్చు.తప్పకుండా ప్రభాస్ సినిమాలో కూడా యోగి బాబుకి మంచి పాత్ర ఇచ్చి ఉంటారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.మారుతి డీలక్స్ సినిమాలో మళయాళ భామ మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది. 2023 సెకండ్ హాఫ్ లో ఈ మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.