బిగ్ బాస్ సీజన్ 6 లో ఎప్పటిలానే 11వ వారం నామినేషన్స్ కూడా హాట్ హాట్ గా జరిగాయి.ఈ వారం కూడా ఎక్కువ నామినేషన్స్ ఇనయాకే పడ్డాయి.
తను ఆడిన ఆట నచ్చలేదని చెప్పినా సరే ఇనయా నా ఆట నాది ఒకరు నచ్చేలా ఆడటం తన వల్ల కాదని అనేసింది.అంతేనా ఇనయా వర్సెస్ ఫైమా ఓ రేంజ్ లో మాటలతో పోట్లాడుకున్నారు.
ఇక ఈ వారం జౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు 9 మంది హౌస్ మెట్స్ నామినేట్ అయ్యారు.ఇంతకీ ఈ వారం హౌస్ నుంచి ఎవరెవరు నామినేట్ అయ్యారు అంటే ఇనయా, ఫైమా, రేవంత్, ఆది రెడ్డి, వాసంతి, మెరీనా, శ్రీహాన్, బాలాదిత్య ఈ తొమ్మిది మంది నామినేషన్స్ లో ఉన్నారు.
ఇక నామినేషన్స్ పూర్తి కాగానే ఓటింగ్స్ ప్రారంభం అవుతాయి.ఈసారి అనూహ్యంగా మళ్లీ ఇనయా రేటింగ్ పెరుగుతూ వస్తుంది.ఇక ఈ వారం ఉన్న నామినేషన్స్ లో ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే అందరు వాసంతి అనే అంటున్నారు.ఓ పక్క బాలాదిత్య కూడా ఈమధ్య కొద్దిగా ఆటలో వీక్ అయ్యాడు.
అతని మీద కూడా ఎలిమినేషన్ కత్తి ఉండే ఛాన్స్ ఉంది.మరి వీకెండ్ ఎవరు ఈ వీక్ హౌస్ కి గుడ్ బై చెబుతారో చూడాలి.