అర్చన.నిరీక్షణ, దాసీ వంటి సినిమాలతో ఉత్తమ నటి గా అవార్డులు పొందటమే కాదు.ప్రజల మనస్సులో చెరగని స్థానాన్ని కూడా సంపాదించుకుంది.ఆమె చేసిన సినిమాలతోనే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్న అర్చన నిరీక్షణ సినిమాలో భాను చందర్ సరసన జాకెట్ లేకుండా నటించి సౌత్ లో ఏ హీరోయిన్ చేయని సాహసాన్ని చేసింది అనే చెప్పాలి.
దర్శకుడు బాలు మహేంద్ర నల్ల కాలువల లాంటి అనేక మంది హీరోయిన్స్ ని పరిచయం చేసిన సంగతి మన అందరికి తెలిసిందే.అప్పుడప్పుడే అవకాశాల వేటలో ఉన్న అర్చన బాలు మహేంద్ర నిరీక్షణ సినిమాలో అవకాశం ఇచ్చాడు.
ఇక ఎక్కువగా తమిళ సినిమాలతోనే ఆమె పాపులర్ అయ్యింది.ఇప్పటికి ఆమె నటించిన సినిమాలు చాల తక్కువ అయినా కూడా అర్చన పేరు చెప్తే నిన్నటి తరం వారికి మక్కువ ఎక్కువ.పక్క తెలుగు అమ్మాయి అయినా హిందీ సినిమా రంగంలో తొలుత హీరోయిన్ గా రంగ ప్రవేశం చేసింది.ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ రంగాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించింది.
ఆమె అస్సలు పేరు సుధా. సినిమాల కోసం పేరు మార్చుకుంది.
ఇక తెలుగు లో లేడీస్ టైలర్ సినిమాతో కామెడి చిత్రంలో కూడా నటించిన పేరు తెచ్చుకున్న అర్చన ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ సరసన హీరోయిన్ గా నటించింది.
అయితే సినిమాల సగంతి కాసేపు పక్కన పెడితే అర్చన ప్రేమ వ్యవహారం అప్పట్లో పెద్ద సంచలనమనే చెప్పాలి.ఆమెకు గురువుగా భావించిన బాలు మహేంద్ర తోనే ప్రేమలో పడింది అర్చన.అయితే బాలు మహేంద్ర జీవితంలో అప్పటికీ చాల మంది ఉన్నారు.
పెళ్ళై ఒక కొడుకు ఉన్న బాలు మహేంద్ర హీరోయిన్ శోభను ప్రేమిచి రెండవ వివాహం చేసుకున్నాడు.కానీ ఆమె 18 ఏళ్ళ ప్రాయంలోనే ఆత్మ హత్య చేసుకొని కన్ను మూసింది.
ఆమె మరణానికి బాలు మహేంద్ర కారణం అంటూ అప్పట్లో అంత భావించారు.ఇక ఆ తర్వాత ఒక వైపు హీరోయిన్ అర్చన తో ప్రేమలో పడిన బాలు మహేంద్ర అయన సినిమాల ద్వారా వచ్చిన మరొక హీరోయిన్ మౌనిక ను కూడా ప్రేమించారు.
అయితే మౌనిక మాత్రం బాలు మహేంద్ర ప్రేమ కోసం పరితపించిపోయేది.పిచ్చి పిచ్సిగా ప్రేమించి చివరికి ఆమె వైపు తిప్ప్పుకుంది.
దాంతో అర్చన తో బాలు మహేంద్ర బంధం ముగిసిపోయింది.