విశాఖ, పెందుర్తి: టీడీపీ నేత బుద్ద వెంకన్న.అనకాపల్లి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ కి దమ్ముంటే 2024 లో అనకాపల్లిలో పోటీ చెయ్యమనండి.
ఓడించి తీరుతాం.మంత్రికి సవాలు విసిరిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు బుద్ధ వెంకన్న.
విజయ్ సాయి రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 17 నెలలు మాత్రమే జైల్లో ఉన్నారు కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరు చేసిన అవినీతి అక్రమాలపై జీవితకాల జైలు శిక్ష వేయించడం ఖాయమని వెంకన్న స్పష్టం చేశారు.
పెందుర్తి ఉత్తరాంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి గుడిలో విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు.
అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పీలా గోవింద సత్యనారాయణ నిర్మించిన గుడులు సైతం వదలటం లేదని కుల్చేమని అనడం హాస్యాస్పదం.నన్ను గానీ అయ్యన్నపాత్రుడు వంటి సీనియర్ నాయకులను అర్ధరాత్రి సమయంలో అరెస్టులు చేయడంపై రేపు రాబోయే తెలుగుదేశం పార్టీ వారికి తగిన బుద్ధి చెబుతుందని తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.