YCP Minister Merugu Nagarjuna : ఎస్సీ గురుకుల విద్యార్థులకు కార్పొరేట్ శిక్షణ ఇస్తున్నామంటున్న వైసీపీ మంత్రి..!!

వైసీపీ మంత్రి మెరుగు నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు.గురుకుల పాఠశాలల్లో చదివే ఎస్సీ విద్యార్థులకు మెరుగైన విద్య కల్పించే దిశగా ప్రభుత్వం మరింతగా ముందుకు అడుగులు వేసినట్లు స్పష్టం చేశారు.

 Ycp Minister Who Is Giving Corporate Training To Sc Gurukul Students Ycp Ministe-TeluguStop.com

దీనిలో భాగంగా విద్యార్థుల విద్యాభివృద్ధికి … వారి భవిష్యత్తుకు ఉపాధి కలిగేలా ఎస్సీ గురుకులలో అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ, టిసిఎస్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఇ- విద్యాలోక్, వాయిస్ ఫర్ గర్ల్స్ తదితర ప్రముఖ సంస్థల ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలియజేశారు.

తద్వారా పిల్లల్లో దాగున్న ప్రతిభను వెలికి తీయడానికి విద్యార్థి విద్యన్ మంతాన్ అనే కార్యక్రమాన్ని ncert సహకారం ద్వారా నిర్వహిస్తున్నట్లు వైసీపీ మంత్రి మెరుగు నాగార్జున స్పష్టం చేశారు.

 కొద్ది నెలల క్రితం సాంఘిక సంక్షేమ అధికారులతో భేటీ అయిన సమయంలో పిల్లల భోజనం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.అయితే ఇప్పుడు గురుకుల ఎస్సీ విద్యార్థులకు కార్పొరేట్ తరహా విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మంత్రి చేసిన వ్యాఖ్యలకు విద్యార్థులు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube