టాలీవుడ్ బాక్సాఫీస్ గత వారం వెల వెల పోయింది.నాలుగైదు సినిమా లు ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా ఏ ఒక్క సినిమా ఆకట్టుకునే విధంగా లేకపోవడం తో ప్రేక్షకులు అంతకు ముందు వారం విడుదల అయిన కన్నడ డబ్బింగ్ సినిమా కాంతార నే చూసేందుకు ఆసక్తి చూపించారు.
తాజాగా ఈ వారం అయినా బాక్సాఫీస్ ముందుకు పెద్ద సినిమాలు వస్తాయంటే అది కూడా లేదు అంటూ తేలి పోయింది.ఈ వారం చిన్న సినిమా లు ఐదు ఆరు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా తేలి పోయింది.
అందులో అల్లు శిరీష్ హీరోగా నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా ఒకటి కాగా మరోటి సంతోష్ శోభన్ హీరోగా నటించిన లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినిమాలు ఉన్నాయి.
ఈ రెండు కాకుండా ఆకాశం, తగ్గేదేలే, బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
ఈ ఐదు సినిమా లు కాకుండా మరో రెండు మూడు డబ్బింగ్ సినిమా లు కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా లేదని వచ్చే వారం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద గల గల కనిపించడం అనుమానమే అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు బాక్సాఫీస్ వద్ద గల గల చూసి చాలా కాలమైందని.పెద్ద సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.వచ్చే వారం సమంత నటించిన యశోద సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.నవంబర్ 11న ముందుకు రాబోతున్న యశోద సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద సందడి చేసే అవకాశం ఉందని అంతా నమ్మకం తో ఎదురు చూస్తున్నారు.
ఆ సినిమా వచ్చే వరకు ఈ సినిమాలతో కాలం నెట్టుకు రావాల్సిందేనా అంటూ కొందరు ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.