సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప పార్ట్ 1 ఇప్పటికే సంచలనాలు సృష్టించింది.పాన్ ఇండియా రేంజ్ లో పుష్ప 1 సంచలనాలు అన్ని ఇన్ని కావు.
ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమా అదే అంచనాలతో వస్తుంది.ఈ సినిమా విషయంలో సుకుమార్ అండ్ టీం చాలా జాగ్రత్త పడుతున్నారు.
పుష్ప పార్ట్ 1 కేవలం చిత్తూరు అడవుల్లో మాత్రమే ఎక్కువ శాతం జరిగింది.అయితే ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ లో బ్యాంకాక్ కి కూడా వెళ్తారని తెలుస్తుంది.
పుష్ప రాజ్ బ్యాంకాక్ కి ఎందుకు వెళ్తాడు.ఎవరి కోసం అక్కడకు వెళ్తాడు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.పుష్ప 2 లోనే అసలు కథ ఉంటుందని ఊరిస్తున్నాడు సుకుమార్.అంచనాలకు మించి పుష్ప 1 సూపర్ హిట్ కాగా పుష్ప 2 కోసం అంతకుమించి అనిపించేలా చేస్తున్నారు.
సినిమా సెకండ్ పార్ట్ లో మరిన్ని సర్ ప్రైజ్ లు ఉంటాయని తెలుస్తుంది.పుష్ప 2 వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.
పుష్ప 2 లో ఇప్పటికే మరికొన్ని కొత్త పాత్రలు ఉంటాయని చెబుతున్నారు.పుష్ప 1 ని మించి పుష్ప 2 మాస్ ఫీస్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతుంది.