రేలంగి నరసింహారావు గారు… ఆయన తెలుగు సినిమాలో దర్శకుడిగా పనిచేసి ఎంతో ఎత్తుకు ఎదిగారు.ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం, ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీసు, పోలీసు భార్య, సుందరి సుబ్బారావు వంటి అనేక కామెడీ ఓరియంటెడ్ సినిమాలు తీసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో రేలంగి నరసింహారావు గారికి ఒక సుస్థిర స్థానం ఉండేలా చేసుకున్నారు.
అయితే ఇదంతా ప్రస్తుతం విషయం.గతంలోకి వెళ్తే ఆయనకు సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేని రోజులవి.
సినిమాల్లోకి వెళ్లాలనే కుతూహలం ఉంది.దాంతో ఏం చేయాలో అర్థం కాక తన కుటుంబానికి దగ్గర వాడైనా దాసరి దగ్గరికి నేరుగా వెళ్ళిపోయారు.
అప్పటికే దాసరి 1972లో తొలి సినిమా అయినా తాత మనవడు అని చిత్రానికి దర్శకత్వం వహించి విడుదల చేయగా అది ఎంతో పెద్ద హిట్ అయింది.
దాంతో అదే నిర్మాణ సంస్థ అయిన ప్రతాప్ బ్యానర్ లో సంసారం సాగరం అనే మరొక సినిమా తీయాలని ప్రతాప్ ఆర్ట్స్ అధినేత కే రాఘవగారు మరియు దాసరి నిర్ణయించుకున్నారు.
దానిలో అసిస్టెంట్ డైరెక్టర్ గా నైనా చేయాలని ఉద్దేశంతో దాసరి ని అడగ్గా ఆయన ఓకే అని ఓ రోజు నేరుగా రాఘవ గారి దగ్గరికి తీసుకెళ్లారు.అప్పటికే ఇంటి ముందున్న గార్డెన్ లో అయన కూర్చొని ఉన్నారు.
ఇక వెళ్ళిన అసలు విషయం చెప్పాడు దాసరి.తనను అసిస్టెంట్ డైరెక్టర్ గా పెట్టుకోవాలనుకున్న విషయం రాఘవ గారికి చెప్పారు.
దాంతో రాఘవగారు రేలంగిని పైనుంచి కింది వరకు ఎగా దిగా చూసి లోపలికి వెళ్లి మీ గురువుగారికి ఓ కుర్చీ తీసుకురా అని ఆదేశించారు.దాంతో దాసరి గారు కంగారు పడ్డారు.
ఎందుకంటే రేలంగి అప్పటికే స్థితిమంతుడు.ఆయన తండ్రి డాక్టర్.
పాలకొల్లులో ఎంతో పెద్ద భవంతి కూడా ఉంది.ఇంట్లో నౌకర్లు, చాకర్లు ఉండేవారు .
అలాంటి వ్యక్తి తనకు కుర్చీ తీసుకురావడం ఏంటి అని కంగారు పడుతుంటే రాఘవ గారు అడ్డుకున్నారు.కానీ రేలంగి గారు మాత్రం సంకోచించకుండా లోపలికి వెళ్లి కుర్చీలు తీసుకొచ్చారు.ఆ తర్వాత పని మనిషి టీలు తీసుకురాగా తాగిన టీ కప్పులను లోపల పెట్టు అని మరోసారి రాఘవగారు రేలంగి ఆదేశించారు.మరో మారు కంగారు పడ్డాడు దాసరి.
కానీ ఒక్క మాట కూడా అనకుండా ఆ కాపులను లోపల పెట్టి వచ్చాడు.ఇక కాసేపు మాట్లాడుకున్న తర్వాత బయటకు వెళ్ళిపోతున్న దాసరి, రేలంగి లను ఆపి ఇంట్లో ఎంతో మంది నౌకర్లు ఉన్న నీ చేత ఎందుకు పని చేయించానో తెలుసా? అని ప్రశ్నించారు దానికి ఆయన తెలీదని సమాధానం చెప్పారు.
ఎందుకంటే నువ్వు సినిమాలో అసిస్టెంట్ దర్శకుడుగా పని చేస్తుంటే షూటింగ్ జరుగుతున్న సమయంలో షాట్ రెడీ అయితే ఆర్టిస్ట్ గబగబా వెళ్ళిపోతూ తన చేతిలో ఉన్న కాఫీ కప్పు నీ చేతిలో పెట్టి వెళ్ళొచ్చు.ఆమె చేతిలో ఉన్న చెప్పులు నీ చేతికి ఇచ్చి వెళ్ళచ్చు.ఇవన్నీ చేయగలిగితే నువ్వు ఇండస్ట్రీలో రాణిస్తావు.అక్కడ ఉన్న ఏ పనైనా కూడా చేయాల్సి రావచ్చు.ఒకవేళ టచప్ బాయ్ మందు రాకపోతే టచప్ కూడా నువ్వే చేయాల్సి రావచ్చు.ఏదైనా చేయడానికి సిద్ధపడితేనే ఇండస్ట్రీలో రాణిస్తావు.
కానీ నాకు అంత ఆస్తి ఉంది.నేనెందుకు చేయాలని నువ్వు గొప్పలకపోతే ఇండస్ట్రీ నిన్నేమి ఉద్ధరించదు దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది.
నిన్ను మాత్రం వదిలేస్తుంది అన్ని ఆలోచించుకొని కష్టపడి పని చేస్తే పైకి వస్తావు అని చెప్పారు.ఆ తర్వాత ఎంతో పట్టుదలతో రేలంగి గారు దర్శకుడిగా ఎదిగి ప్రముఖ వ్యక్తి గా మారారు.