జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం మంగళగిరికి పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు.మరి కొద్ది సేపటిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.
ఈ క్రమంలో ఎన్నడూ లేని విధంగా పార్టీలో మూడు ఎల్ఈడి స్క్రీన్ లు ఏర్పాటు చేయడం జరిగింది.దీంతో పవన్ ఏం ప్రసంగం చేస్తారన్నది సస్పెన్స్ గా నెలకొంది.
మరోవైపు విశాఖ ఘటన దృష్టిలో పెట్టుకొని పార్టీ కార్యాలయం ద్వారాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది.నిన్న మధ్యాహ్నం విశాఖపట్నం నుండి మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంకు చేరుకుని వైసీపీ పార్టీ నేతలపై ప్రభుత్వంపై పవన్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.అయితే ఇప్పుడు ఏకంగా ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టడంతో పవన్ దేన్ని గురించి ప్రసంగం చేస్తారన్నది పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరంగా మారింది.
ఇక ఇదే సమయంలో ఈరోజు ఏపీ గవర్నర్ తో పవన్ కళ్యాణ్ బేటీ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.