మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా గాడ్ ఫాదర్.ఈ సినిమాతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు మెగాస్టార్.
ఆచార్య బిగ్గెస్ట్ ప్లాప్ తో మెగా ఫ్యాన్స్ పూర్తిగా నిరాశ చెందారు.ఇక ఆచార్య తర్వాత కూడా చిరు రీమేక్ సినిమాతోనే రాబోతున్నాడు అని తెలిసి ఈ సినిమా అసలు హిట్ అవుతుందో లేదో అని ఆందోళన చెందారు.
కానీ అందరి ఆందోళనను తరిమేస్తూ మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమాతో బాస్ ఈజ్ బ్యాక్ అనేలా చేసాడు.గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5న దసరా కానుకగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి దసరా పండుగను మరింత సంతోషం అయ్యేలా చేసింది.తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది.
ఇందులో చిరుతో పాటు చాలా మంది స్టార్స్ నటించారు.లేడీ సూపర్ స్టార్ నయనతార మెగాస్టార్ కు చెల్లెలి పాత్రలో నటించగా.సత్యదేవ్ విలన్ పాత్రలో నటించాడు.అలాగే సల్మాన్ ఖాన్, పూరీ జగన్నాథ్, అనసూయ, సునీల్ వంటి వారు కూడా ఈ సినిమా కీలక రోల్స్ లో నటించిన విషయం తెలిసిందే.
మరి ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో మెగాస్టార్ మంచి ఖుషీలో ఉన్నారు.ఈ సినిమా సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తునాన్రు.
మరి ఇందులో భాగంగానే తాజాగా మీడియాతో ముచ్చటించిన చిరు ఓటిటి ఎంట్రీ గురించి అదిరిపోయే న్యూస్ చెప్పారు.తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.దీంతో అవి కాస్త నెట్టింట వైరల్ అయ్యాయి.ప్రెజెంట్ టాలీవుడ్ లో సీనియర్ హీరోలు వెంకటేష్, బాలయ్య వంటి వారు ఓటిటి లోకి ఎంట్రీ ఇచ్చారు.మరి చిరు ఎంట్రీ పై కూడా మీడియా ప్రశ్నించారు.ఈయన కూడా ఓటిటి ఎంట్రీ పై పాజిటివ్ గానే స్పందించారు.
ఓటిటి లో కూడా ఎంట్రీ ఇచ్చేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదు అని.మంచి సబ్జెక్టు వస్తే డెఫినెట్ గా చేస్తానని తన ఓటిటి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు.మరి ఈయనకు నచ్చిన సబ్జెక్టు ఎప్పుడు దొరుకుతుందో.ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో చూడాలి.ప్రెజెంట్ అయితే గాడ్ ఫాదర్ సక్సెస్ ఎంజాయ్ చేస్తూనే వాల్తేరు వీరయ్య సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు చిరు.