శ్రీ సత్య సాయి జిల్లాలో ప్రభుత్వం నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది.దీనిలో భాగంగా కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి నిరసన సెగ తగిలింది.
గొల్లపల్లి తండాలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని గ్రామస్తులు అడ్డుకోవడంతో చేదు అనుభవం ఎదురైంది.అనంతరం ఎమ్మెల్యే గో బ్యాక్ .ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఎలా వస్తారు అంటూ గ్రామస్తులు ప్రశ్నించారు.
పోలీసులు అడ్డుకుని వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేసిన గ్రామస్తులు వినకపోవడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.