1.సినీ నటుడు ప్రియాంత్ అరెస్ట్
వర్ధమాన సినీ నటుడు ప్రియాంత్ రావును జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.ప్రేమ పేరుతో వంచించి అత్యాచారం చేశాడంటూ ప్రియాంత్ పై జూనియర్ ఆర్టిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
2.మంత్రులపై ఈటల రాజేందర్ ఆగ్రహం
ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులపై బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మంత్రులను పంపి ప్రజలను తాగుబోతుల్ని చేస్తున్న ఘనత కెసిఆర్ దేనని విమర్శించారు.
3.హవాల సొమ్ము పది కోట్లు పట్టివేత
గడిచిన పది రోజుల వ్యవధిలో 10 కోట్లు హవాలా నగదును స్వాధీనం చేసుకున్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు.
4.ఢిల్లీలో కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలు బిజీగా ఉన్నారు.టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత తొలిసారి కెసిఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు.
5.హాంగర్ టెక్నాలజీ సంస్థ పై సైబర్ దాడులు
హైదరాబాద్ లో కొత్త రకం సైబర్ అటాక్ జరిగింది.ప్రముఖ హాంగర్ టెక్నాలజీ సంస్థ పై సైబర్ దాడులు జరిగాయి.
6.సుద్దాల జాతీయ పురస్కారానికి అందెశ్రీ ఎంపిక
ప్రసిద్ధ కవి అందెశ్రీ సుద్దాల హనుమంతు జానకమ్మ జాతి పురస్కారానికి ఎంపికయ్యారు.
7.జహీరాబాద్ లో ఆవులకు లంపి స్కిన్ వైరస్
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని కోహిర్ మొగుడంపల్లి మండలాల్లో ఆవులకు లంపి స్కిన్ వైరస్ సోకుతోది.ఇప్పటివరకు కోహిర్ మండలంలో 15 ఆవులకు పైగా ఈ వైరస్ బారిన పడినట్లు పశువైద్యాధికారి తెలిపారు.
8.రాజాసింగ్ కేసులో కౌంటర్ దాఖలకు గడువు
గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడి యాక్ట్ పెట్టడానికి సవాల్ చేస్తూ, దాఖలైన పిటిషన్ లో కౌంటర్ దాఖలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఈనెల 20 వరకు గడువు ఇచ్చింది.
9.ఎమ్మెన్నార్ విద్యార్థులు తరగతులకు వెళ్లాల్సిందే : హై కోర్టు
ఎమ్మెన్నార్ మెడికల్ కాలేజీకి చెందిన విద్యార్థులు తరగతులకు హాజరు కావాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.
10.ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ డిస్మిస్
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటీషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది.
11.తుంగభద్ర జలాశయానికి కొనసాగుతున్న వరద
తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది.ప్రస్తుత నీటిమట్టం 1632.85 అడుగులకు చేరింది.
12.సీమ మేలు కోసం త్వరలో జేఏసి
కర్నూలులో హైకోర్టు ఏర్పాటును అడ్డుకుంటే ఊరుకునేది లేదని, సీమ మేలు కోసం త్వరలోనే జేఏసీని ఏర్పాటు చేయబోతున్నట్లు రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
13.కాలిగ్రఫీ లో స్టేట్ చాంఫియన్ గా సంహిత
ప్రపంచ కాలిగ్రఫీ హ్యాండ్ రైటింగ్ దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన పోటీల్లో స్టేట్ ఛాంపియన్ గా కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం వైద్య నగర్ కు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని కురసాల శ్రీకృష్ణ సంహిత నిలిచింది.
14.ఆ రెండు రోజుల్లో శ్రీవారి సేవలు రద్దు
ఈనెల 25 నవంబర్ 8న 12 గంటల పాటు శ్రీవారి సేవలను రద్దు చేస్తున్నట్లు టిటిడి ప్రకటించింది.
15.భారీగా శ్రీవారి బంగారు డాలర్ల విక్రయం
తిరుమల శ్రీవారి బంగారు డాలర్లు భారీగా విక్రమయ్యాయి.ఒకేసారి 10 గ్రాముల బంగారు డాలర్లు 400 అమ్ముడుపోవడంతో టీటీడీకి దాదాపు రెండు కోట్లు లభించింది.
16.రేపు కలెక్టర్ల ద్వారా సీఎంకు లేకాస్త్రాలు : ఆర్టీసీ జేఏసీ
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియలో భాగంగా అక్టోబర్ 13న సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టర్ల ద్వారా సీఎంకు లేఖల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఏపీ పిటిడి ఉద్యోగుల సంఘాల ఐక్యవేదిక తెలిపింది.
17.బిగ్ బాస్ పై హైకోర్టు కామెంట్స్
తెలుగులో ప్రసారమవుతున్న బిగ్బాస్ షో ను సెన్సార్ చేయకుండా నేరుగా ప్రచారం చేస్తున్నారని ఈ షోలో హింస, అశ్లీలం, అసభ్యత ప్రోత్సహించే విధంగా ఉందని ఆరోపిస్తూ నిర్మాత సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి హైకోర్టులో ఫీల్ దాఖలు చేశారు .దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు అసలు ఈ షోలో ఏముందో తెలుసుకునేందుకు తాము ఒకటి రెండు ఎపిసోడ్ లు బిగ్ బాస్ చూస్తామన్నారు.
18.సికింద్రాబాద్ తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు
రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది రద్దీ దృష్ట్యా ఈనెల 12 నుంచి పలు ప్రాంతాలకు ఆరు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది.
19.నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు
ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో నేటితో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
20.30వ రోజుకు అమరావతి రైతుల పాదయాత్ర
రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు మహిళలు పాదయాత్ర నేటికీ 30వ రోజుకు చేరుకుంది .ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు నుంచి పైడిపర్రు పాలంగి మీదుగా రైతుల మహాపాదయాత్ర కొనసాగుతోంది.