నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది.కేంద్ర ఎన్నికల సంఘం ఉపఎన్నిక షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.
దీనిలో భాగంగా జాతీయ పార్టీ బీఆర్ఎస్ గానే మునుగోడు బరిలో దిగుతామని ప్రకటించిన సీఎం కేసీఆర్.ప్రతి ఎంపీటీసీ స్థానాన్ని ఒక యూనిట్ గా విభజించారు.
యూనిట్ కు మంత్రులు, ఎమ్మెల్యేలను ఇంఛార్జ్ లుగా నియమించారు.కాగా ఈనెల 5న మునుగోడు బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించి, 6 నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారని సమాచారం.
అయితే, మంత్రి కేటీఆర్ కు గట్టుప్పల్, హరీశ్ రావుకు మర్రిగూడ ఎంపీటీసీ స్థానాలు అప్పగించినట్లు తెలుస్తోంది.