భాంగ్రా స్టెప్స్ వేస్తూ ఆశ్చర్యపరిచిన బర్రె.. ఫన్నీ వీడియో వైరల్‌..

సోషల్ మీడియాలో యానిమల్ వీడియోలకు కొదవలేదు.డైలీ ఇంటర్నెట్‌లో కొన్ని వేల ఫన్నీ యానిమల్ వీడియోలు ప్రత్యక్షమవుతుంటాయి.

 Bufellow Surprised By Doing Bhangra Steps.. Funny Video Viral, Animal Video, Buf-TeluguStop.com

అయితే తాజాగా సోషల్ మీడియాలో కనిపించిన ఒక వీడియో చూసి నెటిజన్లు పగలబడి నవ్వుతున్నారు.ఈ వీడియోలో ఒక మహిళతో కలిసి ఒక దేశీయ బర్రె భాంగ్రా డ్యాన్స్ చేసింది.

కుక్క, పిల్లి డ్యాన్స్ చేయడం ఇప్పటి వరకు చూశాం కానీ ఒక గేదె డ్యాన్స్ చేస్తుండటాన్ని చూడటం ఇదే మొదటిసారి అని నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ గేదె నృత్యం చేస్తుందని చాలామంది నమ్మలేకపోతున్నప్పటికీ.

మరికొందరు మాత్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించిన మహిళను ప్రశంసిస్తున్నారు.వైరల్ అవుతున్న వీడియో క్లిప్‌లో, గేదె యజమానిగా కనిపించే మహిళ ఇంటి పెరట్లో నిలబడి ఉంది.

ఆమె తన గేదెలకు ఆహారం ఇస్తూ కొన్ని భాంగ్రా స్టెప్పులు వేయడం ప్రారంభించింది.ఆమె నాట్యం చేస్తున్నప్పుడు, తన గేదెను కూడా డ్యాన్స్ చేయమని చెప్పింది.

అయితే ఆ మహిళ చెప్పిన వెంటనే ఈ బర్రె భాంగ్రా స్టెప్స్ వేస్తూ అదరగొట్టింది.ఈ నాట్యం చూసి అక్కడే ఉన్న చిన్నారులు కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేశారు.

ఈ వీడియోను @videonation.teb అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.ఈ అద్భుతమైన వీడియోకి 35 వేల వరకు వ్యూస్, 2 వేలకు పైగా లైకులు వచ్చాయి.ఈ వీడియో చూశాక.“మహిళలు తలచుకుంటే బర్రెలతో డ్యాన్స్ ఏంటి ఏదైనా చేయించగలరు” అని కొందరు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.ఈ ఫన్నీ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube