లైగర్ ఫ్లాప్ వెనుక ఆ హీరో ఫ్యాన్స్ ఉన్నారా.. ఛార్మీ ట్వీట్ వల్లే అంటూ?

పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కిన లైగర్ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుందనే సంగతి తెలిసిందే.కారణాలేవైనా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో విఫలైమైంది.

 Star Hero Fans Behind Liger Movie Flop Result Details Here , Liger Movie, Sta-TeluguStop.com

గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని విజయ్ దేవరకొండ ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తాడని అందరూ భావిస్తే అందుకు భిన్నంగా జరిగింది.అయితే లైగర్ ఫ్లాప్ వెనుక ఒక హీరో అభిమానులు ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

చాలా సంవత్సరాల క్రితం టాలీవుడ్ కు చెందిన ప్రముఖ స్టార్ హీరో సినిమా థియేటర్లలో విడుదల కాగా ఆ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చింది.ఆ ట్వీట్ లో నవ్వుతున్న ఎమోజీలు ఉన్నాయి.

అయితే స్టార్ హీరో సినిమా ఫ్లాప్ కావడం వల్లే ఛార్మి అలా చేసిందని కామెంట్లు వినిపించాయి.ఇప్పుడు ఆ స్టార్ హీరో అభిమానులు ఛార్మి ట్వీట్ ను షేర్ చేస్తూ నవ్ ఇట్ ఈజ్ యువర్ టర్న్ అని పేర్కొన్నారు.

లైగర్ సినిమా ఫ్లాప్ కావడానికి ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ కారణం కాకపోయినా ఈ సినిమా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ కావడం వెనుక మాత్రం ఆ స్టార్ హీరో అభిమానులు ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు లైగర్ సినిమా పుంజుకునే అవకాశాలు దాదాపుగా లేవని చెప్పవచ్చు.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని పూరీ జగన్నాథ్ కాన్ఫిడెన్స్ ను ప్రదర్శించగా వాస్తవంగా అందుకు భిన్నంగా జరిగింది.

Telugu Charmi, Flop Result, Liger, Puri Jagannath, Fans-Movie

వైరల్ అవుతున్న ట్వీట్ గురించి ఛార్మి ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.ఫస్ట్ వీకెండ్ తర్వాత లైగర్ సినిమా పుంజుకునే అవకాశాలు దాదాపుగా లేవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పూరీ జగన్నాథ్ కెరీర్ లోని చెత్త సినిమాలలో ఈ సినిమా ఒకటని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube