కేశినేని జంపింగ్ ఖాయ‌మేనా..? ముహూర్తం ఫిక్స్..?

అధిష్టానంతో గ్యాప్ పెరిగి గ‌త నెల‌లుగా సైలెంట్ గా ఉన్న ఎంపీ కేశినేని నాని టీడీపీకి షాక్ ఇచ్చేలా ఉన్నార‌ని అంటున్నారు.క‌మ్మ వ‌ర్గానికి చెందిన నేత‌గా పేరున్న ఆయ‌న త్వ‌ర‌లోనే బీజేపీలో చేర‌డానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

 Keshineni Jumping Sure Fix The Moment Mp Keshineni Nani, Keshineni Swetha, Vij-TeluguStop.com

అయితే దీనిపై నాని మాత్రం ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.కానీ జరుగుతున్న పరిణామాలను చూస్తే ఆయన పార్టీ మార‌డం ఖాయమనే వాదన వినిపిస్తోంది.2014కు ముందు టీడీపీ తీర్థం పుచ్చుకున్న నాని ఆ ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు.2019 ఎన్నిక‌ల్లోనూ ఆయన టీడీపీ తరఫున విజ‌యం సాధించారు.అయితే ఈ విజయంపై నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.తాను సొంతగానే గెలిచాన‌ని.చంద్రబాబు ఇమేజ్ తో గెలిచారనే కుక్కలకు నేను ఒక్కటే చెబుతున్నాను.జిల్లాలో 16 నియోజకవర్గాలు ఉన్నాయి.

ఆయన ఇమేజ్ ఉంటే.అక్కడ ఎందుకు టీడీపీ ఓడిపోయింది.

పోనీ మచిలీపట్నంలో ఎందుకు గెలవలేదు.? అని విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఆయన ప్రశ్నించారు.

అధినేత‌తో గ్యాప్

ఇక అప్పటి నుంచి టీడీపీకి ఆయనకు మధ్య‌ గ్యాప్ పెరుగుతూ వ‌చ్చింది.ఇటీవ‌ల బాబుకు బొకే అంద‌జేసే విష‌యంలో కూడా నాని నిరాక‌రించ‌డంపై పెద్ద దుమార‌మే రేగింది.

ఇక ఇలాంటి విష‌యాల‌పై అనేక విశ్లేషణలు కూడా ఉన్నాయి.ఇక మ‌రో విష‌యం ఏంటంటే నానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మధ్య స‌త్సంబంధాలు ఉన్న విష‌యం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకు కూడా చెప్పకుండా నాని రెండో సారి గెలిచిన తర్వాత నేరుగా గడ్కరీ వద్దకు వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.ఈ క్రమంలో ఇప్పుడు గడ్కరీ సూచనల మేరకు కేశినేని నాని బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు మానసికంగా రెడీ అయ్యారని అంటున్నారు.

Telugu Ap Poltics, Chandra Babu, Nitin Gadkari, Vijayavada-Political

బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ.!

అయితే నాని ఈ నెల 29న ఆయన బీజేపీ లో చేరనున్నారని కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.ఆయనతో పాటు ఆయన కుమార్తె కార్పొరేటర్ కేశినేని శ్వేత కూడా బీజేపీ కండువా కప్పుకొంటారని టీడీపీ నేతలే మాట్లాడుకుంటున్నారు.అంతేకాకుండా ఆమెను తూర్పు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయించే అవకాశం ఉందని కూడా అంటున్నారు.

ఇక నాని విజయవాడ ఎంపీగా బీజేపీ త‌ర‌ఫున పోటీ చేస్తారని అంటున్నారు.చూడాలి మ‌రి నాని వ్య‌వ‌హారం ఎంత‌వ‌ర‌కు వెళ్తుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube