సీక్రెట్ కెమెరాలను ఎలా గుర్తించాలి?

మనం ఎక్కడికైనా వెళ్లినప్పుడు అక్కడి కొన్ని రోజులు ఉండాల్సి వస్తుంది.అప్పుడు ఏదైనా హోటల్ రూమ్స్, లాడ్జ్, హాస్టల్స్, పేయింగ్ గెస్ట్.

 How To Detect Secret Cameras , Secret Cemera, Find Out, Technology News, Technol-TeluguStop.com

.ఇలా వివిధ చోట్ల స్టే చేయాల్సి ఉంటుంది.

అయితే అలాంటి చోట సీక్రెట్ కెమెరాలు పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి.ఈ స్పై, హిడెన్ కెమెరాలు గుర్తించలేనంతగా చిన్నవిగా ఉంటాయి.

వాటిని గుర్తించడం అంత తేలిక కాదు.ఈ కెమెరాలు అక్కడి పరిసరాల్లో కలిసిపోయి ఏమాత్రం కనిపించకుండా ఉంటాయి.

బెడ్ రూమ్ లేదా బాత్ రూమ్ వంటి ప్రైవేట్ ప్రాంతాల్లో ఈ సీక్రెట్ కెమెరాలను అమర్చినట్లు అనుమానం వస్తే ఏం చేయాలి.వాటిని గుర్తించడానికి నిపుణుల సాయం తీసుకోవచ్చు.

ప్రత్యేకమైన పరికరాలతో పసిగట్టొచ్చు.అయితే అవి ఒక్కోసారి మనకు అందుబాటులో ఉండకపోవచ్చు.

అలాంటప్పుడు మన స్మార్ట్ ఫోన్ ద్వారానే సింపుల్ గా ఈ సీక్రెట్ కెమెరాలను గుర్తించవచ్చు.దానికోసం ఏంచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

స్మార్ట్ ఫోన్ సాయంతో సీక్రెట్ కెమెరాను గుర్తించడం ఎలా?


ఫస్ట్ మీరు ఉండే గదిలో లైట్లను ఆర్పేయాలి.కిటికీలను కర్టెన్లతో మూసివేయాలి.

గది మొత్తం చీకటిగా ఉండేలా చూసుకోవాలి.ఆ తర్వాత మీ ఫోన్ లో ఫ్లాష్ లైట్, కెమెరాను ఒకేసారి ఆన్ చేయాలి.

ఇక్కడ సీక్రెట్ కెమెరా ఉండొచ్చు అని అనుమానం ఉన్న చోట స్మార్ట్ ఫోన్ కెమెరాను ఫోకస్ చేయాలి.ఒకవేళ అక్కడ సీక్రెట్ కెమెరా ఉంటే.

మీ ఫోన్ స్క్రీన్ మీద వెలుగు మెరపులు వస్తాయి.ఫోన్ లో ఫ్లాష్ లైట్ లేకపోతే, వేరే ఫాష్ లైట్ సహాయంతో కెమెరాతో ఫోకస్ చేయాలి.

Telugu Find, Camera, Secret Cemerra, Ups-Latest News - Telugu

ఫాష్ లైట్ లేకపోయినా గుర్తించవచ్చు

:
ఫాష్ లైట్ లేకపోయానా సీక్రెట్ కెమెరాను గుర్తించవచ్చు.సీక్రెట్ కెమెరాలు చీకటిలో ఇన్ ఫ్రారెడ్ కాంతిని ఉపయోగించుకుంటాయి.ఈ ఇన్ ఫ్రారెడ్ కాంతి అనేది మన కంటికి కనిపించదు.కానీ స్మార్ట్ ఫోన్ కెమెరా దీనిని గుర్తించగలదు.

అయితే ఫోన్ మెయిన్ కెమెరా దీనిని గుర్తించలేదు.అందులో ఇన్ ఫ్రారెడ్ కాంతి ఫిల్టర్ ఉండొచ్చు.

కాబట్టీ ఫ్రంట్ కెమెరాను ఉపయోగించి గుర్తించవచ్చు.అయితే మన ఫోన్ ఇన్ ఫ్రారెడ్ కాంతిని గుర్తిస్తుందా లేదా అని తెలుసుకునేందుకు టీవీ రిమోట్ ద్వారా పరీక్షించవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube