కొన్నేళ్ల క్రితం వరకు కొత్త సినిమా విడుదలతే వారం, పది రోజుల వరకు టికెట్లు దొరకని పరిస్థితి ఉండేది.ప్రస్తుతం పెద్ద హీరోల సినిమాలు, మిడిల్ రేంజ్ హీరోల సినిమాలు ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో విడుదలవుతూ ఉండటంతో మార్నింగ్ షోలకు సైతం సులువుగా టికెట్లు దొరుకుతున్నాయి.
మరీ భారీ అంచనాలు ఉన్న సినిమాలు మాత్రమే థియేటర్లలో నూటికి నూరు శాతం ఆక్యుపెన్సీతో ప్రదర్శితం అవుతున్నాయి.
ఈ నెల 22వ తేదీన నాగచైతన్య హీరోగా దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన థాంక్యూ మూవీ థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.
క్లాస్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా థియేటర్లలో ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు సాధించలేదు.థాంక్యూ మూవీ ఆరో రోజు కలెక్షన్లు కేవలం ఆరు లక్షల రూపాయలు మాత్రమే అంటే ఈ సినిమా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో సులభంగానే అర్థమవుతుంది.
ఈ సినిమా ప్రదర్శిస్తున్న పలు థియేటర్లలో 1+1 ఆఫర్ అమలవుతోంది.నంద్యాల జిల్లా వెలుగోడులోని రంగా థియేటర్ 70 రూపాయలకే థాంక్యూ మూవీని ఒక టికెట్ తో ఇద్దరు చూసే అవకాశం కల్పించింది.
భవిష్యత్తులో అయినా ఈ పరిస్థితులు మారాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.నాగచైతన్య గత సినిమాలు పాజిటివ్ టాక్ తో కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్నాయి.
థాంక్యూ సినిమాకు మాత్రం బాక్సాఫీస్ వద్ద పరిస్థితులు అనుకూలించకపోవడంతో సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుందని చెప్పవచ్చు.థియేటర్లకు ప్రేక్షకులను రప్పించేలా నిర్మాతలు నిర్ణయాలు తీసుకోకపోతే మాత్రం రాబోయే రోజుల్లో 1+2 1+3 ఆఫర్లు అమలులోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని చెప్పవచ్చు.అక్కినేని హీరోల తర్వాత ప్రాజెక్ట్ లు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాల్సి ఉంది.