ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో సంపాదించుకున్న వారిలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఒకరు.ఈయన నటించిన లైగర్ సినిమా ఇంకా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాకపోయినప్పటికీ ఈయనకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి క్రేజ్ ఏర్పడింది.
ఏకంగా బాలీవుడ్ హీరోయిన్ల సైతం తనతో డేట్ చేయాలని ఉందంటూ వెల్లడించడం గమనార్హం.ఇకపోతే తాజాగా కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్న విజయ్ దేవరకొండ ప్రేమ పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ సందర్భంగా ఈయన పెళ్లి గురించి మాట్లాడుతూ నేను పెళ్లి చేసుకొని పిల్లల్ని కనే రోజు ఆ విషయాన్ని నేను గట్టిగా చెబుతాను.అప్పటివరకు నన్ను ప్రేమిస్తున్న వారిని బాధ పెట్టాలనుకోవడం లేదు అంటూ ఈయన వెల్లడించారు.
హీరోగా ఎంతో మంది నన్ను ప్రేమించి నా పోస్టర్స్ ఇళ్లలో పెట్టుకోవడం అలాగే మొబైల్ స్క్రీన్ పై నా ఫోటోలు పెట్టుకున్నారు.అలాంటి వారు నాకు ఎప్పుడు ప్రేమ గౌరవాన్ని అందిస్తారు.
నేను పెళ్లి గురించి ఇప్పుడు మాట్లాడి వారి గుండె ముక్కలు చేయాలనుకోవడం లేదు అంటూ విజయ్ దేవరకొండ ఈ సందర్భంగా వెల్లడించారు.
ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ తన పెళ్లి గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇకపోతే ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండతో పాటు బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కూడా హాజరయ్యారు.విజయ్ దేవరకొండ పాల్గొన్న ఎపిసోడ్ 28వ తేదీ సాయంత్రం ఏడు గంటలకు టెలికాస్ట్ కానుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండ ఎలాంటి విషయాలను వెల్లడించారు అనే విషయం తెలియాలంటే మరికొన్ని గంటల పాటు వేచి చూడాలి.